Illu Illalu Pillalu October 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-ఏడిపించిన ఇడ్లీ-సాగ‌ర్‌ను నిల‌దీసిన న‌ర్మ‌ద‌-చందు విడాకులు

Illu Illalu Pillalu October 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్లో భద్రావతి మాట విననని వల్లి చెప్పేస్తుంది. లంచం తీసుకున్నందుకు సాగర్ ను నర్మద నిలదీస్తుంది. సాగర్ పచ్చి అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఇడ్లీ బాబాయ్ ఏడిపించేస్తాడు. విడాకుల కోసం చందు లాయర్ ను కలుస్తాడు.

Published on: Oct 28, 2026, 08:25:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu October 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. దారిన పోతున్న వల్లిని పిలిచి మరీ భద్రావతి సెటైర్లు వేస్తుంది. సాధుజీవిలా మారిపోయావంటా. నిన్ను అడ్డుపెట్టుకొని రామరాజును జైల్లో ఉండేలా చేద్దామనుకున్నా. కానీ నా ప్లాన్ అంతా కంపు కంపు చేశావని భద్రావతి అంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

మీ మాట వినను

నువ్వేం బాధపడకు. నేను ఏదో ఒకటి చేసి నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టేలా చేస్తానని భద్రావతి చెప్తుంది. వల్లికి ఆఫర్ ఇస్తుంది. అమ్మా తల్లి, ఇప్పటివరకూ చేసింది చాలు. మా అమ్మ మాటలు, నీ మాటలు విని నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. ఇక మీదట మీ మాట వినను. నా జీవితాన్ని నేను చక్కదిద్దుకుంటా. పాతికేళ్లుగా మీరు మీ తోడబుట్టిన చెల్లెలు కుటుంబాన్ని బాధపెడుతూనే ఉన్నారని బల్లక్కాయ్ అంటుంది.

కాళ్ల దగ్గరకు రప్పించుకుంటా

మా మామ రామరాజు ఆయన భార్యను, మీ మేనకోడలు ప్రేమను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నేను మారతాను. మీరు కూడా మారకపోతే అనుభవిస్తారని చెప్పి వల్లి వెళ్లిపోతుంది. దాన్ని మళ్లీ నా కాళ్ల దగ్గరకు రప్పించుకుంటానని వల్లి గురించి చింతామణితో భద్రావతి అంటుంది.

వేదవతి వెటకారం

ఇటు ఇంట్లో వల్లిని క్షమించేదే లేదని తల్లి శారదాంబతో వేదవతి చెప్తుంది. మనుషులన్నాక తప్పులు సహజం కదండి. కాస్త పెద్ద మనసుతో క్షమించాలండీ అని సుక్కు అడుగుతుంది. విశాలమైన మనసు చేసుకోని నిన్ను కూడా తరిమేయాలా? అప్పుడు ఇద్దరూ కలిసి ఆటలాడుకోండని సుక్కుతో వెటకారంగా మాట్లాడుతుంది వేదవతి.

చిన్నోడు రూ.30 లక్షలు, నడిపోడు రూ.20 లక్షల కోసం తిరుగుతున్నారని తల్లితో వేదవతి చెప్తుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయా అని శారదాంబ ఫీల్ అవుతుంది. అందుకే నన్ను మీ ఇంటికి తీసుకెళ్లమని శారదాంబను సుక్కు అడుగుతుంది. సుక్కు పెట్టిన కాఫీని ఫస్ట్ ధీరజ్, ప్రేమ.. ఆ తర్వాత నర్మద తీసుకొని తాగుతారు. నర్మద అయితే రెండు గ్లాస్ ల కాఫీని ఒకేసారి తాగుతుంది.

చింతామణి దగ్గర ఎందుకు?

చింతామణి దగ్గర రూ.30 లక్షలు తీసుకోవడానికి ధీరజ్ ఒప్పుకొన్న విషయాన్ని ఇంట్లో ప్రేమ చెప్తుంది. చింతామణి గురించి తెలిసి కూడా ఆవిడ దగ్గర డబ్బు తీసుకోవడం ఏంటీ? పాత విషయాలు మనసులో పెట్టుకొని చింతామణి ఏమైనా చేస్తే ఎంత రిస్క్ అవుతుందని నర్మద కోప్పడుతుంది. నేను చెప్తే ధీరజ్ వినడం లేదక్కా అని ప్రేమ కూడా అంటుంది.

సాగర్ కు షాక్

అప్పుడే సాగర్ వస్తాడు. సాగర్ ను చూసి నర్మదకు ఫుల్ కోపమొస్తుంది. అమౌంట్ సెట్ అయ్యాయి. సేట్ కు కట్టేద్దామని నర్మదతో సాగర్ చెప్తాడు. డబ్బులు ఎలా అరెంజ్ అయ్యాయని నర్మద అడుగుతుంది. లంచం తీసుకొని సాగర్ సంతకం చేసిన ఫైల్ ను నర్మద చూపిస్తుంది. దీంతో సాగర్ ఫ్యూజుల్ అవుట్ అవుతాయి. లంచాలు తీసుకుంటున్నావ్ సాగర్ అని నర్మద అంటుంది.

నర్మదపైనే నిందలు

ఏదో ఒక ఫైల్ తీసుకొచ్చి నన్ను బ్లేమ్ చేస్తున్నావా? నీ దగ్గర ఉన్న ఫ్రూఫ్స్ ఏంటీ? ఆధారాలు లేకుండా మాట్లాడితే బాగుండదని సాగర్ రివర్స్ అటాక్ చేస్తాడు. మీ అబ్బాయి లంచాలకు బాగా అలవాటు పడ్డాడని అత్తతో నర్మద అంటుంది. నిందలు వేస్తే బాగోదని కోపంతో సాగర్ లోపలికి వెళ్లిపోతాడు. పచ్చి అబద్దంతో నిజాన్ని కప్పి పుచ్చాలని చూస్తాడు. దీంతో నర్మద ఏడుస్తుంది.

వాడు అంత నమ్మకంగా అంటున్నాడంటే నిజంగా తీసుకోలేదేమో. ఎక్కడో పొరపాటు జరిగిందేమోనని నర్మదతో వేదవతి అంటుంది. నిజం తెలుసుకుంటా. ఆ తప్పు నుంచి నా భర్తను సరిదిద్దుకుంటానని నర్మద అంటుంది.

అన్నం తినని వల్లి

ఇటు భాగ్యం ఇంట్లో తల్లి ఇచ్చిన అన్నం ప్లేటును వల్లి నెట్టేస్తుంది. కన్నందుకు తప్పదు కదా తిను అని భాగ్యం దెబ్బిపొడుస్తుంది. కానీ తనకొద్దని వల్లి అంటుంది. నీ ఇష్టమొచ్చినట్లు తగలడు. నేను చెప్పినట్లు వినుంటే నీ కాళ్లు పట్టుకొని అత్తారింటికి తీసుకెళ్లేవాళ్లు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని భాగ్యం అంటుంది. కానీ తల్లిపైనే వల్లి కోప్పడుతుంది.

ఏడిపించేసిన ఇడ్లీ బాబాయి

ఇడ్లీ బాబాయి వచ్చి అమ్మడూ తినమ్మా అని వల్లిని రిక్వెస్ట్ చేస్తాడు. మేం చాలా మోసాలు, పాపాలు చేశాం. అవన్నీ క్షమించరానివే. నేను అసమర్థపు తండ్రిని. సైకిల్ మీద ఇడ్లీలు అమ్మి బిడ్డకు గొప్ప భవిష్యత్ అందించాలనుకున్నా. మా బిడ్డ మాలాగా బతకకూడదని అనుకున్నాం. తప్పైనా సరే మోసాల మీద మోసాల చేశాం. నీ కళ్లలో సంతోషం చూడాలనే చేశాం. కానీ కన్నీళ్లు చూస్తుంటే గుండె పగిలిపోతుంది కదా అని వల్లిని పట్టుకొని ఇడ్లీ బాబాయి ఏడ్చేస్తాడు.

నువ్వు మారావు తల్లి. ఆ దేవుడు కచ్చితంగా నీకు రెండో అవకాశం ఇస్తాడు. ఆ నమ్మకంతో ఎదురు చూడమ్మా. తినమ్మా అని వల్లికి ఇడ్లీ బాబాయి తినిపిస్తాడు. ఈ సీన్ తోనే ఇడ్లీ బాబాయి ఏడిపించేస్తాడు.

లాయర్ దగ్గరకు చందు

మరోవైపు చందు వెళ్లి వల్లితో విడాకులు ఇప్పించమని లాయర్ ను కలుస్తాడు. నేను పూర్తిగా మోసపోయా. మీరే హెల్ప్ చేయాలని జరిగిందంతా లాయర్ కు చెప్తాడు చందు. వాళ్లకు ఏదైనా సెటిల్మెంట్ చేయడానికైనా నేను రెడీ. ఈ విషయం ఇంట్లోవాళ్లకు తెలియదని చందు చెప్తాడు. లాయర్స్ ఇచ్చిన పేపర్స్ పైన చందు సంతకం పెడతాడు.

రేపే మీ ఆవిడకు నోటీసులు వెళ్లిపోతాయి. చందు ఓ సారి ఆలోచించకపోయావా అని లాయర్ అడుగుతాడు. నేను నిర్ణయం తీసుకున్నా. నాకు నా భార్య వద్దు అని చందు తెగేసి చెప్తాడు. ఇటు రామరాజు ఇంట్లో బతుకమ్మ వేడుకలకు అందరూ రెడీ అవుతారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More