Illu Illalu Pillalu October 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-షాకింగ్-తాగొచ్చిన చందు-బల్లక్కాయ్ వార్నింగ్-భద్రావతి కుట్ర

Illu Illalu Pillalu October 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే అక్టోబర్ 29 ఎపిసోడ్ లో చందు తాగేసి రావడంతో అందరూ షాక్ అవుతారు. అత్తారింట్లో బతుకమ్మ సందడి చూసి వల్లి ఏడుస్తుంది. తల్లికి వార్నింగ్ ఇస్తుంది. వల్లికి చందు పంపిన విడాకుల నోటీసు భద్రావతికిి చిక్కుతుంది. ధీరజ్ కు ప్రేమ ముద్దు పెడుతుంది.

Published on: Oct 29, 2026, 07:57:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu October 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రామరాజు ఇంట్లో బతుకమ్మ వేడుకలకు అందరూ రెడీ అవుతారు. బతుకమ్మను పేర్చుతారు. మన ఇంటి నుంచి నాలుగు బతుకమ్మలు. నాకు తెలిసి ఊర్లో ఎవరి ఇంటి నుంచి నాలుగు బతుకమ్మలు రావని అమూల్య సంబరపడిపోతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

వేదవతి కన్నీళ్లు

అప్పుడే వేదవతి ఏడుస్తుంది. సంతోషం సంపూర్ణంగా లేదు. కోడళ్లని లక్ష్మీ దేవతలు అంటారు. పెద్ద కోడలు ఉండి ఉంటే ఈ సంతోషం పరిపూర్ణంగా ఉండేది. కానీ అది తన చేతులారా చేసుకుంది. అందరం కలిసి ఆనందంగా ఉండటం ఆ పైవాడికి ఇష్టం లేదేమో అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

తాగి వచ్చిన చందు

అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆ రాక్షసి గురించి ఎందుకు తలుచుకుంటున్నావ్ అమ్మా అంటూ ఫుల్ గా తాగిన చందు తూలుతూ వస్తాడు. అత్తారింటి నాశనం కోరుకున్న పాపిష్టి దాని పీడ వదిలినందుకు ఆనందపడాలి అమ్మా అని చందు అంటాడు. నువ్వు తాగేసి వచ్చావా అని వేదవతి అడుగుతుంది.

ఫీలైన రామరాజు

బతుకమ్మ పండగ కదా మనమందరం గుడికి వెళ్లాలి. వెళ్లి స్నానం చేసి రా అని చందును రామరాజు లోపలికి పంపిస్తాడు. వాడిని ఎందుకు తాగి వచ్చాడో ఎందుకు అడగలేదని రామరాజును వేదవతి ప్రశ్నిస్తుంది. వాడి బాధ ఏంటో మనకు తెలీదా బుజ్జమ్మా. నా వల్లే వాడి జీవితం ఇలా అయిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడాలా? అని రామరాజు ఫీల్ అవుతాడు.

మీ తప్పు లేదు మామయ్య

పిల్లలకు గొప్ప జీవితం ఇవ్వాలనుకునే గొప్ప తండ్రి మీరు. మీ మంచితనాన్ని వాళ్లు (భాగ్యం ఫ్యామిలీ) అలుసుగా తీసుకొని మోసం చేశారు. ఇందులో మీ తప్పు ఏముందని నర్మద అంటుంది. నా అసమర్థత ఉంది. నేను వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం వల్లే ఇలా జరిగింది. నేను జాగ్రత్తపడి ఉంటే నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని రామరాజు అంటాడు.

నాన్నను ధైర్యంగా ఉండమని ధీరజ్ చెప్తాడు. పెద్దోడు బాధలో ఉన్నాడు కాబట్టి గుడికి వద్దని సాగర్ అంటాడు. కానీ పెద్దోడిని బాధలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అయినా మనం గుడికి వెళ్లాలని రామరాజు చెప్తాడు.

బల్లక్కాయ్ ఏడుపు

మరోవైపు పుట్టింట్లో వల్లి బతుకమ్మ పేరుస్తుంటుంది. అప్పుడే అత్తారింట్లో అందరూ సంతోషంగా బతుకమ్మ పేరుస్తున్న వీడియోను బల్లక్కాయ్ కు సుక్కు పంపిస్తుంది. నేను అక్కడ ఉంటే పెద్ద కోడలిని కాబట్టి నాతోనే బతుకమ్మ చేయించేవాళ్లు. అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. ఇక్కడ నేను దిక్కులేనిదానిలా ఏడుస్తున్నానని బల్లక్కాయ్ ఏడ్చేస్తుంది.

తల్లికి వల్లి వార్నింగ్

చెప్తే నీకు అర్థం కాదా? నువ్వు బతుకమ్మ చేసుకుని వెళ్తే నిన్ను కలుపుకొంటారా? నీ బతుకమ్మను వాళ్లలో కలిపేసుకుంటారా? అని వల్లిని తల్లి భాగ్యం అడుగుతుంది. నన్ను కలుపుకోకపోయినా సరే కానీ నా బతుకమ్మను కలుపుకొంటే చాలని వల్లి చెప్తుంది. నేను దూరంగా ఉన్నా సరే మా అత్తారింటి వాళ్లను చూస్తా. మా అత్త, మామయ్య ఆశీర్వాదం తీసుకుంటా. నేను మారానని నమ్మి ఏదో ఒక రోజు ఇంట్లోకి రానిస్తారని వల్లి నమ్మకంతో చెప్తుంది.

అదంతా నీ భ్రమ. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్లు కరగరు. కొమ్ములు విరగ్గొట్టి మోకాళ్ల మీద కూర్చోపెట్టాలని భాగ్యం చెప్తుంది. ఇన్ని రోజులూ ఇలాంటి సలహాలు ఇచ్చి నా కాపురాన్ని ఇలా చేశావ్. ఇంకోసారి ఇలా చెప్పి కన్నతల్లిని చంపిన కూతురిగా నన్ను మార్చకు అని తల్లికి వల్లి వార్నింగ్ ఇస్తుంది.

విడాకుల నోటీసు

ఇక రామరాజు ఇల్లు కళకళలాడుతుందని భద్రావతి కుళ్లుకుంటుంది. అప్పుడే సేనాపతికి చెక్ బుక్ వచ్చిందని పోస్ట్ మ్యాన్ వచ్చి చెప్తాడు. అతని దగ్గర చందు వల్లికి పంపించిన విడాకుల నోటీసు కూడా ఉంటుంది. అది భద్రావతి చూస్తుంది. ఈ అవకాశాన్ని వాడుకుని ఆ రామరాజుకు బలమైన దెబ్బ కొట్టమని ఆ పైవాడు ఈ విడాకుల నోటీసు మన దగ్గరకు వచ్చేలా చేశాడ్రా సేనా అని భద్రావతి అంటుంది.

భద్రావతి కుట్ర

రామరాజే కొడుకుతో విడాకుల నోటీసు పంపించాడని భాగ్యానికి చెప్పి రచ్చ చేద్దాం అక్క. దెబ్బకు పండగ వాతావారణం మొత్తం ఆవిరి అవుతుందని సేనాపతి సలహా ఇస్తాడు. గొడవ బతుకమ్మ సంబరాల్లో జరిగితే ఊరంతా తెలుస్తుంది. ఊరందరి ముందు రామరాజుకు అవమానం జరగాలి. రామరాజు అసలు ఇంట్లో నుంచే బయటకు రాకుండా ఉండాలని భద్రావతి చెప్తుంది.

ప్రేమ ముద్దు

మరోవైపు ప్రేమ అందాన్ని చూస్తూ ధీరజ్ మైమరిచిపోతాడు. నడుమును గిల్లుతాడు. వెంటనే వెనక్కి సడెన్ గా తిరిగిన ప్రేమ ధీరజ్ చెంప మీద ముద్దు పెడుతుంది. రేయ్ సచ్చినోడా అలా గిల్లావేంట్రా? ఎంత భయపడ్డానోనని ప్రేమ అడుగుతుంది. ధీరజ్ రొమాంటిక్ గా ప్రేమ దగ్గరకు వెళ్తాడు. లిప్ కిస్ ఇవ్వబోతుంటే ధీరజ్ ను ప్రేమ నెట్టేస్తుంది. ఈ రోజు పండగ ఇలా చేయొద్దని ప్రేమ అంటుంది.

ఒక్క ముద్దయినా ఇవ్వమని ధీరజ్ రిక్వెస్ట్ చేస్తాడు. అద్దంలో ఉన్న ధీరజ్ ముఖానికి ప్రేమ ముద్దు పెట్టి పారిపోతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More