Illu Illalu Pillalu November 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-బల్లక్కాయ్ దరిద్రదేవత-రౌడీలను చితకబాదిన రామరాజు ఫ్యామిలీ!

Illu Illalu Pillalu Serial November 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 14 ఎపిసోడ్ లో వల్లిపై చందు సీరియస్ అవుతాడు. విడాకులు వద్దని నర్మద నచ్చజెప్పినా వినడు. ఇక భద్రావతి ప్లాన్ ప్రకారం రౌడీలు వచ్చి రచ్చ చేస్తారు. వాళ్లను అందరూ కలిసి చితకబాదుతారు. వల్లి దరిద్రదేవత అని చందు అంటాడు.

Published on: Nov 14, 2026, 07:39:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial November 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీ ఓపెనింగ్ కు వల్లి రావడంపై చందు ఫుల్ సీరియస్ అవుతాడు. వదినను తానే రమ్మన్నానని ధీరజ్ అబద్ధం చెప్తాడు. ఎవరు వదినా? తనతో బంధం ఎప్పుడో తెగిపోయింది. విడాకులు పంపించానని తెలుసు కదా అని చందు ఫైర్ అవుతాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

నేనే వెళ్లిపోతా బా

నువ్వు విడాకులు పంపిస్తే ఏంటీ బా? నేను ఇవ్వలేదు కదా. ఆ కోర్టు ఇచ్చినా ఒప్పుకోనని వల్లి బాధపడుతూ అంటుంది. రేయ్ చిన్నోడా మర్యాదగా తనను ఇక్కడనుంచి పంపించేయ్. తను కావాలా? నేను కావాలా తేల్చుకో అని ధీరజ్ ను చందు అడుగుతాడు. నేనే వెళ్లిపోతా బా. మీ అందరినీ చూశా కదా. అది చాలు. కనీసం బయటి వ్యక్తిలాగైనా నన్ను రానిస్తారేమో అనుకున్నా. కానీ నాకు ఆ విలువ కూడా లేదని తెలిసిపోయిందని వల్లి బయటకు అడుగులు వేస్తుంది.

బుద్ధి చెప్పిన రామరాజు

వల్లిని శారదాంబ ఆపుతుంది. పెద్ద మనవడా నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఇది శుభకార్యం. ఆడపిల్లతో కన్నీళ్లు పెట్టిస్తావా? అల్లుడు గారు మీకు ఇది తెలియదా? ఏమ్మా వేదవతి నలుగురి పెళ్లిళ్లు చేశావ్ కదా ఆ మాత్రం తెలియదా? అని శారదాంబ అడుగుతుంది. ఆడపిల్ల ఏడిస్తే ఆ చోటుకు మంచిది కాదు. శత్రువైనా సరే సారె పెట్టి పంపించాలని చందుకు రామరాజు బుద్ధి చెప్తాడు.

చిన్నోడు వాడి వ్యాపారానికి వదిన రావాలని పిలిపించుకున్నాడు. మధ్యలో నీకేంట్రా బాధ. నా మాట వింటానన్నావ్ కదా అని చందును రామరాజు అడుగుతాడు. వేదవతి కూడా ఈ విషయాన్ని వదిలేయమని చందుకు చెప్తుంది. మీకు, మీ అందరికీ తన ఆనందమే ముఖ్యం కదా అని చందు బయటకు వెళ్లిపోతాడు.

వల్లి అక్క మారింది బావ

వల్లి, నర్మద, ప్రేమ కలిసి దీపాన్ని వెలిగిస్తారు. లోపల పూజ జరుగుతుంది. నర్మద ఏమో బయట ఉన్న చందు దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. అసలు వల్లిని ఎవరు రమ్మన్నారని చందు అడుగుతాడు. మంచి మనసు చేసుకొని ఈ విషయం అర్థం చేసుకోండి. వల్లి చేసిన తప్పులను బయటకు తీసుకొచ్చింది నేనే కదా. ఇప్పుడు వల్లి అక్క మారిందని నాకు నమ్మకం వచ్చిందని చందుకు నర్మద చెప్తుంది.

విడాకులు వద్దు

ఇప్పుడే వల్లక్కను ఇంట్లోకి తీసుకొద్దామని కాదు. తను మారిందని మీకు నమ్మకం వచ్చాకే తీసుకొద్దాం. కానీ విడాకుల్లాంటివి వద్దు బావగారు అని చందును నర్మద రిక్వెస్ట్ చేస్తుంది. విడాకులిస్తే మీ లైఫ్ తో పాటు ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. బయట మీ విడాకుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటా. రామరాజు పెంపకం ఇదేనా అని బయట అంటే విని మామయ్య బాధపడ్డారని నర్మద చెప్తుంది.

వల్లక్క మీద కోపం చూపించండి, ఒక్క విడాకుల విషయం తప్పా అని నర్మద అడుగుతుంది. వాళ్లను క్షమించడం మీకు అలవాటైపోయింది. వల్లిని చాలా ఎక్కువగా ప్రేమించా. అలాంటి వల్లి ఇలా చేసిందంటే నాకెంత బాధగా, కోపంగా ఉంటుంది చెప్పు. అలాంటి దానితో కాపురం చేయడం నా వల్ల కాదు. విడాకుల విషయంలో నన్ను కన్విన్స్ చేయాలనుకునేవాళ్లు శత్రువులు అవుతారని చందు లోపలికి వెళ్లిపోతాడు.

వల్లి సారీ

ఈ మాటలన్నీ వల్లి వింటుంది. తన వల్ల నర్మద బాధపడుతుందని వల్లి సారీ చెప్తుంది. నువ్వు మారావు. అది బావగారు తెలుసుకోవడానికి టైమ్ పడుతుందని నర్మద చెప్తుంది. ఇక ట్రావెల్ ఏజెన్సీలో పూజ కంప్లీట్ అవుతుంది. ప్రేమ, ధీరజ్ కలిసి పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుంటారు. రామరాజు డబ్బిచ్చి బోణీ అనుకో అని ధీరజ్ తో చెప్తాడు.

రౌడీల రచ్చ

అప్పుడే భద్రావతి కుట్ర ప్రకారం రౌడీలు దూసుకొని వస్తారు. మా పర్మిషన్ లేకుండా ట్రావెల్ ఏజెన్సీ పెట్టారేంట్రా అని రచ్చ చేస్తారు. తిరుపతిని నెట్టేస్తారు. ఈ ఏరియాలో ప్రతి ఒక్క షాప్ వాడు మాకు మామూలు కట్టాల్సిందేనని రౌడీలు అంటాడు. ఎంత ధైర్యం ఉంటే మా మామ మీద చేయి వేస్తారు? మర్యాదగా బయటకు వెళ్లాల్సిందేనని ధీరజ్ సీరియస్ అవుతాడు.

చిల్లరదానా

నెలకు రూ.1 లక్ష మామూలు కట్టాలి. మాకు చెప్పకుండా ఆఫీస్ ఓపెన్ చేసినందుకు ఎక్స్ ట్రా రూ.50 వేలు ఇవ్వాలని రౌడీలు డిమాండ్ చేస్తారు. ఒక్క రూపాయి కూడా కట్టేది లేదని ధీరజ్ అంటాడు. షటర్ మూసేసి వెళ్తామని రౌడీలు అంటాడు. నన్ను మీ సొంత చెల్లి అనుకోండి. ఈ రూ.5 వేలు తీసుకొని వెళ్లిపోండి అని ప్రేమ డబ్బు ఇస్తుంది. చిల్లరదానా అని ఆ డబ్బును ప్రేమ ముఖం మీదే విసిరి కొడతారు.

రౌడీలను చితకబాది

దీంతో ధీరజ్ కు చిర్రెత్తుకొస్తుంది. రౌడీలను కొడతాడు. అన్నదమ్ములతో పాటు విశ్వ కూడా కలిసి రౌడీలను చితకబాదుతారు. నర్మద, ప్రేమ, వేదవతి కూడా కలిసి ఆ రౌడీలను కొడతారు. మీ సంగతి చూస్తామంటూ రౌడీలు పారిపోతారు. నిన్ను చిల్లరదానా అన్నందుకు కోపం వచ్చింది. ఎవడైనా నిన్ను ఒక్కమాట అన్నా ఒప్పుకోనని ప్రేమకు ధీరజ్ చెప్తాడు.

వల్లి దరిద్ర దేవత

అప్పుడే వల్లిని బయటకు నెట్టేస్తాడు చందు. ఈ దరిద్రాన్ని ఇక్కడికి తీసుకురావొద్దని చెప్పా కదా. ఇది రావడం వల్లే ఇలా జరిగింది. ఇది దరిద్రదేవత అని చందు ఆవేశంతో ఊగిపోతాడు. ప్రతిదానికి వదినను అనడం నీకు అలవాటైందని ధీరజ్ అంటాడు. వల్లిని అక్కడి నుంచి పంపించేస్తారు. చందు కూడా కోపంతో వెళ్లిపోతాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More