Illu Illalu Pillalu November 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- చందు ఎలా తెలుసు? అంజలిని వణికించిన వల్లి- ధీరజ్ రొమాన్స్
Illu Illalu Pillalu November 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 16 ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. అంజలి, వల్లి కలుస్తారు. చందు ఎలా తెలుసని వల్లి గుచ్చిగుచ్చి అడుగుతుంది. ప్రేమతో రొమాన్స్ చేయాలని ధీరజ్ చూస్తాడు. రామరాజు సంబరపడిపోతాడు.
Illu Illalu Pillalu November 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ ట్రావెల్స్ ఏజెన్సీ ఓపెనింగ్ సందర్భంగా చందు బావ తనను అన్న మాటలను తలుచుకుంటూ ఏడుస్తూ వల్లి నడుచుకుంటూ వెళ్తుంది. రోడ్డు పక్కన వెళ్తున్న వల్లిని అంజలి చూసి తన కారు ఆపుతుంది.

మా బావ ఎలా తెలుసు?
మీరు చందు వాళ్ల వైఫ్ కదా. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తా రండి. ఒక్కరే నడుచుకుంటూ వెళ్తున్నారేంటీ. మీ ఇల్లు ఇక్కడికి చాలా దూరం కదా. డ్రాప్ చేస్తా అని వల్లిని అంజలి అడుగుతుంది. అసలు మా బావ అంజలికి ఎలా తెలుసని వల్లి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంది. దీంతో వణికిపోయిన అంజలి మాట మారుస్తుంది.
అంజలి అబద్ధం
చందు, నేను ఫ్రెండ్స్ కాదు. మీ మామ రామరాజు అంటే తెలియని వాళ్లు ఎవరుంటారు. అందుకే వాళ్ల అబ్బాయిలు కూడా మాకు పరిచయం ఉంది. బతుకమ్మలో కూడా పెద్ద కోడలు అని ఎవరో మిమ్మల్ని చూపించారు. అందుకే చందు వైఫా అని అడిగానని అంజలి అబద్ధం చెప్తుంది. ఓహో మీరు స్కూల్ ఫ్రెండ్ ఏమో, మీ ద్వారా మా ఆయన్ని అడిగిద్దామనుకున్నానని వల్లి నెమ్మదిగా అనుకుంటుంది.
డివోర్స్ తీసుకున్నామని
అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్లో పని చేస్తున్నానని తన గురించి అంజలి చెప్తుంది. మా ఆయన ఇప్పుడు లేరు. ఆయన్ని పాపం అంటే మీరు పాపమైపోతారు. మేం డివోర్స్ తీసుకున్నాం. ఇప్పుడు అదంతా ఎందుకు? డ్రాప్ చేస్తా రండి అని వల్లిని కార్లోకి ఎక్కిస్తుంది అంజలి. చందు ఏం చేస్తుంటారని వల్లిని అంజలి అడుగుతుంది. ఒకప్పుడు జాబ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు రైస్ మిల్ చూసుకుంటున్నారు. మా ఆయన, మామయ్యకు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని వల్లి చెప్తుంది.
వల్లి కన్నీళ్లను దాచి
మీ మామయ్య కారణంగానే కదా చందు తనను వదిలేశాడని అంజలి తనలో తాను అనుకుంటుంది. మా ఆయన రాముడిలాంటి మనిషి. పరాయి ఆడదాని వంక చూడరు. నన్ను ఒక్క మాట అనరు. నేనే నోరేసుకుని పడిపోతానని వల్లి కన్నీళ్లను దాచుకుంటూ చెప్తుంది. అంజలి కూడా ఏడుపును కంట్రోల్ చేసుకుంటుంది. అమ్మ వాళ్ల ఇంటి దగ్గర వల్లి కారు దిగుతుంది.
అత్తారిల్లు, పుట్టిల్లు ఒకే ఊర్లో కదా. అందుకే తరచూ వస్తుంటానని వల్లి అబద్ధం చెప్తుంది. మీరు చాలా లక్కీ అని అంజలి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పేరు అడగడం మర్చిపోయానని వల్లి అనుకుంటుంది.
చితక్కొట్టారు మేడం
ఇక రామరాజు ఫ్యామిలీ చేతిలో దెబ్బలు తిన్న రౌడీలపై భద్రావతి, భాగ్యం, సేనాపతి సీరియస్ అవుతారు. భయపడి కాళ్ల బేరానికి వచ్చిన ఎన్నో కుటుంబాలను చూశాం. కానీ వీళ్లు (రామరాజు ఫ్యామిలీ) అలా కాదు. చితక్కొట్టారు మేడం అని రౌడీ చెప్తాడు. వెంటనే రౌడీలను భాగ్యం కొడుతుంది. తన్నులు తినేందుకు సిగ్గులేదా. కలలన్నీ వేస్ట్ చేశారని భాగ్యం అంటుంది.
భయం పుట్టించాం సేనా
మీరు వెళ్లిపోండి, అవకాశం ఉన్నప్పుడు ఆ ధీరజ్ సంగతి చూడండని రౌడీలను భద్రావతి పంపిస్తుంది. బలవంతుడినని, బలగం ఉందని విర్రవీగకూడదని సుమతీ శతకం పద్యం చెప్తుంది భద్రావతి. వాళ్లు కలిసి ఉన్నప్పుడు దెబ్బ కొట్టడం కష్టం. విడివిడిగా ఒక్కొక్కరిని దెబ్బ కొట్టాలి సేనా. ఇప్పుడు వాళ్లలో భయం పుట్టించాం. ఆ భయం ఉన్నంతవరకు భద్రావతి గెలిచినట్లేనని భద్రావతి అంటుంది.
ఎస్ఐ ఎగ్జామ్
ఇక ఇంట్లో తన బిజినెస్ గురించి ధీరజ్ వేరేవాళ్లతో ఫోన్లో మాట్లాడుతుంటాడు. ప్రేమ ఏమో పేపర్ చదువుతుంది. అందులో ఎస్ఐ ఎగ్జామ్ కు నోటిఫికేషన్ వచ్చిందని ధీరజ్ ను పిలిచి చెప్తుంది. సంతోషంతో ప్రేమను ధీరజ్ ఎత్తుకొని తిప్పుతాడు. నా ఎస్ఐ పోస్ట్ క్రెడిట్ కూడా నువ్వే కొట్టేద్దామని చూస్తున్నావని ధీరజ్ పై ప్రేమ నిందలు వేస్తుంది.
క్రెడిట్ కొట్టేశావ్
ట్రావెల్ ఏజెన్సీకి మీ నాన్న పేరు పెట్టుకొని మంచి కొడుకని క్రెడిట్ కొట్టేశావ్. ఇప్పుడు నేను ఎస్ఐ అయితే ఆ క్రెడిట్ కూడా కొట్టేదామనుకుంటున్నావ్. ప్రేమ ట్రావెల్ ఏజెన్సీ అని ఉంటుందని ఎన్ని కలలు కన్నానో తెలుసా? భార్యలను హర్ట్ చేయడమే మీ మగవాళ్ల పని. చిన్నపిల్ల అని చూడకుండా కన్నీళ్లు పెట్టిస్తావా అని ప్రేమ అరుస్తుంది. ఇద్దరు సరదాగా గొడవ పడతారు.
రొమాన్స్ కావాలి ప్రేమ
మా నాన్న పేరు పెట్టినందుకు అందరికంటే ఎక్కువగా నువ్వే ఆనందపడతావని నాకు తెలుసు. నిన్ను ఎస్ఐ పరీక్ష కోసం దగ్గరుండి చదివిస్తానని ప్రేమతో ధీరజ్ అంటాడు. మనం చాలా ముందుకు వెళ్లాలి. ట్రావెల్ ఏజెన్సీని డెవలప్ చేయాలి. మామయ్యకు డబ్బు ఇచ్చేయాలి. హోటల్ పెట్టాలని ప్రేమ అంటుంది. ప్రేమను దగ్గరకు తీసుకొని ధీరజ్ రొమాన్స్ కావాలంటాడు. ధీరజ్ ను ప్రేమ బయటకు నెట్టేస్తుంది.
రామరాజు సంబరం
ఇక ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీకి తన పేరు పెట్టడంపై రామరాజు మురిసిపోతాడు. కారణం ఏంటో అని వేదవతి అడుగుతుంది. అందుకు కారణం నా చిన్నోడే. ఏజెన్సీకి నా పేరు పెట్టాడు. భాగ్యంతో నా కాళ్లు పట్టించాడు. సాధారణంగా కోడళ్లు వచ్చిన తర్వాత కొడుకులు మారిపోతారంటారు. కానీ మన కొడుకులు, కోడళ్లు మన కోసమే ఆలోచిస్తారని రామరాజు సంబరపడిపోతాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


