TG Entrance Tests 2025 : తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల, EAPCET ఎప్పుడంటే..

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 4 నుంచి 11 వరకు టీజీ ఈఏపీసెట్‌ - 2026 పరీక్షలు జరుగుతాయి.మే 18న టీజీ లాసెట్ నిర్వహిస్తారు. 

Published on: Dec 30, 2025 9:47 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్ వచ్చేసింది. వచ్చే ఏడాది నిర్వహించబోయే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కీలకమైన ఇంజినీరింగ్ ప్రవేశాలతో సహా ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఈ ప్రవేశ పరీక్షల ఆధారంగా 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్షల ద్వారానే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయం, వైద్యం, న్యాయశాస్త్రం వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

మే 4 నుంచి 11 వరకు టీజీ ఈఏపీసెట్‌ - 2026 పరీక్షలు జరుగుతాయి.మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు ఉండగా… మే 9 నుండి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈసారి కూడా హైదరాబాద్ జేఎన్టీయూనే ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూడనుంది.

మే 13, 14 తేదీల్లో టీజీ ఐసెట్ పరీక్షను నిర్వహిస్తారు. మే 15న ఈసెట్ పరీక్ష జరుగుతుంది. మే 18న లాసెట్, పీజీ ఎల్ సెట్ పరీక్షలంటాయి. మే 28 నుండి 31 వరకు పీజీ ఈసెట్ నిర్వహిస్తారు. టీజీ పీఈసెట్ పరీక్షలు మే 31 నుంచి షురూ అవుతాయి.

పైన పేర్కొన్న ప్రవేశ పరీక్షలన్నీ సీబీటీ విధానంలోనే నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు, సిలబస్ వివరాలను వేర్వురుగా విడుదల చేస్తారు. ఈ పరీక్షల నిర్వహణను వేర్వురు యూనివర్శిటీలు నిర్వహించనున్నాయి.

ప్రవేశ పరీక్షలో వచ్చే ర్యాంకు ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ముందుగా ఫలితాలను ప్రకటించి కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది.ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తుంటారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More