CM Revanth On Police Recruitment 2026 : పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి.

నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ గారితో పాటు ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు.
పకడ్బందీగా నిర్వహించాలి - సీఎం ఆదేశాలు
ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి నియామక ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పాదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నియమ నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఆగస్టు 19 నుంచి దరఖాస్తులు :
మరోవైపు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను అధికారులు ప్రకటించారు.
{{/usCountry}}మరోవైపు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను అధికారులు ప్రకటించారు.
{{/usCountry}}అభ్యర్థులు కేవలం టీఎస్‌ఎల్‌పిఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇతర ఏ మార్గాల్లో పంపిన దరఖాస్తులైనా తిరస్కరిస్తారు. దరఖాస్తుల ప్రారంభ తేదీ ఆగస్టు 19 (ఉదయం 8.00 గంటల నుండి), చివరి తేదీ సెప్టెంబర్ 9 (సాయంత్రం 5.00 గంటల వరకు) దాకా అప్లై చేసుకోవచ్చు.
సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, ఇతర అభ్యర్థులందరికీ (ఓసీ/బీసీ) రూ.1,500గా ఫీజు ఉంది. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్టులు అప్లై చేసే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతర అభ్యర్థులందరికీ రూ.1,200గా ఫీజు నిర్ణయించారు.
- ఆన్‌లైన్ దరఖాస్తులో పార్ట్-1 సమర్పించే ముందు, ఆధార్ ఆధారిత ముఖ ప్రమాణీకరణ పూర్తి చేయడానికి అభ్యర్థులు తమ మొబైల్‌లో ఆధార్ యాప్‌ను డెమో డెవలప్‌మెంట్స్ లేదా స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డ్ సూచించింది.
- దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు కాపీని ప్రింట్ తీసి భద్రపరుచుకోవాలి. సందేహాలు లేదా సమస్యలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.