కొండా సురేఖకు షాక్.. ఆర్అండ్‌బీకి మేడారం జాతర పనులు.. రికార్డులు అప్పగించాలని ఆదేశం

కాంగ్రెస్ పార్టీలో మరోసారి వివాదాలు రచ్చలేపుతున్నాయి. మేడారం జాతర పనులపై మంత్రుల మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా ప్రభుత్వం మేడారం పనులను ఆర్అండ్‌బీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Published on: Oct 16, 2025, 11:55:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్ని రోజులుగా తెలంగాణలో మంత్రుల మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. మేడారం జాతర పనుల విషయంలో వివాదం జరుగుతునే ఉంది. తన శాఖలోకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం ఎక్కువైందని, మేడారం అభివృద్ధి పనులను ఆయన కంపెనీకి దక్కేలా చేసుకున్నారని మంత్రి సురేఖ ఇప్పటికే ఆరోపించారు.

కొండా సురేఖ
కొండా సురేఖ

ఈ వ్యవహారం కొనసాగుతుండగానే.. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మేడారం జాతర అభివృద్ధి పనులను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. రికార్డులను వెంటనే అప్పగించాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్త ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా వరంగల్ కేంద్రంగా రాజకీయం హీటెక్కుతోంది. మేడారం పనుల విషయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి, జిల్లాకు చెందిన మంత్రులు సురేఖ, సీతక్క మధ్య విబేధాలు వచ్చాయి. అయితే కొన్ని రోజులకు సీతక్క సైలెంట్ అయినట్టుగా కనిపించారు. కానీ కొండా సురేఖ Vs పొంగులేటి మధ్య వివాదం నడుస్తూనే ఉంది. తనకు తెలియకుండా టెండర్లు ఎలా కన్ఫామ్ చేస్తారని, పొంగులేటికి చెందిన కంపెనీకి పనులు ఎలా అప్పగిస్తారని ఆమె ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా మేడారం పనుల బాధ్యతలను దేవాదాయ శాఖ నుంచి ఆర్ అండ్ బీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ రచ్చ నడుస్తుండగానే.. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో కొండా సురేఖ నివాసం వద్దకు బుధవారం రాత్రి నలుగురు పోలీసులు వెళ్లారు. ఓఎస్డీ సుమంత్ గురించి ఆరా తీశారు. సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టుగా తెలుసుకున్న సురేఖ కుమార్తె సుస్మిత వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? అని గట్టిగా అడిగారు.

సుమంత్‌ను విధుల నుంచి తప్పించిన తర్వాత ఆయన సురేఖ ఇంట్లోనే ఉన్నారని, ఆయనను పట్టుకునేందు పోలీసులు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే కేసు వివరాలు చెప్పకుండా సుమంత్‌ను అప్పగించేది లేదని కొండా సుస్మిత ఖరాఖండీగా చెప్పేశారు.

అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మీడియా వచ్చింది. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా.. లేదంటే వేరే ప్రభుత్వంలో ఉన్నామా అని సుస్మిత ప్రశ్నించారు. కేసు వివరాలు చెప్పకుండా ఎందుకు వెతుకుతున్నారని మండిపడ్డారు. అసలు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారని అడిగారు. తమ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణలు చేశారు.

కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. డెక్కన్ సిమెంట్ కంపెనీకి విషయంలో ఎవరినో బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More