60 శాతానికి పైగా సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్!

తెలంగాణలో పంచాయతీ పోరు ముగిసింది. దాదాపు 60 శాతానికిపైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. డిసెంబర్ 22వ తేదీన కొత్త సర్పంచులు బాధ్యతలు తీసుకోనున్నారు.

Updated on: Dec 18, 2025, 06:08:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు 60 శాతానికి పైగా సర్పంచ్‌లను గెలుచుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుగల అభ్యర్థులు 25 శాతం పదవులను గెలుచుకోగా, బీజేపీ మద్దతుగల అభ్యర్థులు కేవలం నాలుగు శాతం పంచాయతీల్లో మాత్రమే విజయం సాధించారు. స్వతంత్రులు కనీసం 10 శాతం గెలిచి, పంచాయతీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు.

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా

మూడో దశలో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు ఏకగ్రీవాలతో కలిపి 2,286 పంచాయతీలలో విజయం సాధించగా, బీఆర్ఎస్ మద్దతుగల అభ్యర్థులు 1,142, బీజేపీ 242, ఇతరులు 479 గెలుచుకున్నారు. మూడో దశ ఎన్నికలతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యుల పోల్ ఫలితాలు ప్రకటించిన తర్వాత ఉప సర్పంచ్‌లను కూడా ఎన్నుకున్నారు.

తెలంగాణలో 12,733 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికల్లో జరిగాయి. వీటిలో ఏకగ్రీవాలు చాలానే ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు 7,010 సర్పంచ్ పదవులను గెలుచుకున్నారు, బీఆర్ఎస్ 3,502, బీజేపీ 688, ఇతరులు 1,505 స్థానాలను గెలుచుకున్నారు.

ఎన్నికైన ప్రతినిధులందరూ డిసెంబర్ 20న ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించగా తర్వాత తేదీని మార్చారు. డిసెంబర్ 22న ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు నోడల్ అధికారులను నియమించారు.

మూడో దశలో కనీసం 85.77 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు విడతల్లో కలిపి 85.30 శాతం పోలింగ్ జరిగింది. మొదటి, రెండవ దశల మాదిరిగానే, యాదాద్రి భువనగిరి జిల్లా 92.56 శాతం ఓటింగ్‌తో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది.

85 శాతానికి పైగా ఓట్లు పోలైన జిల్లాలు మెదక్ (90.68 శాతం), సూర్యాపేట (89.25 శాతం), ఖమ్మం (88.82 శాతం), నల్గొండ (88.72 శాతం), జోగులాంబ గద్వాల్ (88.54 శాతం), మహబూబాబాద్ (88.52 శాతం), జనగాం (88.48 శాతం), సిద్ధిపేట (88.45 శాతం), మహబూబ్ నగర్ (88.36 శాతం), వరంగల్ (88.21 శాతం), మంచిర్యాల (87.78 శాతం), సంగారెడ్డి (87.43 శాతం), హనుమకొండ (86.45 శాతం), కరీంనగర్ (86.42 శాతం), రంగారెడ్డి (88.22 శాతం), కామారెడ్డి (85.45 శాతం). చాలా చోట్ల అభ్యర్థులు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More