తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు : కొనసాగుతున్న 3వ విడత పోలింగ్ - సాయంత్రం ఫలితాలు
తెలంగాణలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది.
తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా… ఓటర్లు క్రమంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం 9 తర్వాత చాలా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది.

మధ్యాహ్నం నుంచి కౌంటింగ్…
పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన వారిని ఓటింగ్ కు అనుమతిస్తారు.
ఈ మూడో విడత కింద మొత్తం 12,652 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా… వార్డు సభ్య పదవులకు 75,725 మంది పోటీ పడుతున్నారని అధికారులు తెలిపారు. 36,483 పోలింగ్ కేంద్రాల్లో 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులుగా ఉన్నారు.
మొత్తం3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తుది దశలో 4,159 గ్రామ పంచాయతీలు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా… వీరిలో 394 మంది సర్పంచులు, 7,908 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాంతియుతంగా పోలింగ్ జరిగేలా పోలీసులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
డిసెంబర్ 11న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో 84.28 శాతం, డిసెంబర్ 14న జరిగిన రెండో విడత ఎన్నికల్లో 85.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విడతలో కూడా భారీగానే పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ మూడో విడతతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టంచేశారు.
ఈ తేదీనే కొత్త పాలకవర్గాలతో మొదటి సమావేశం జరగనుంది. ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం గెలిచినవాళ్లు బాధ్యతలను చేపడతారు. ఈ నెల 17 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికే వీటిలో ఫలితాలు తేలిపోయాయి. కొన్నిచోట్ల ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. కోర్టు కేసుల నేపథ్యంలో రాష్ట్రంలోని 32 గ్రామపంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

