తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు : మూడో విడతలోనూ భారీగా నామినేషన్లు - అత్యధికంగా ఎక్కడంటే...?

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. శనివారంతో మూడో విడత నామినేషన్లు ముగిశాయి. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 1,16,880 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

Published on: Dec 7, 2025, 06:58:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీకి భారీగానే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొదటి,రెండో విడతలో ఎక్కువ సంఖ్యలోనే నామినేషన్లు దాఖలు కాగా… మూడో విడతలోనే అదే జోరు కనిపించింది. సర్పంచి, వార్డు స్థానాలకు గానూ అత్యధిక సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయి.

మూడో విడత నామినేషన్లు
మూడో విడత నామినేషన్లు
  • ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం…. 3వ విడత కింద 4,158 గ్రామపంచాయతీల్లోని సర్పంచి పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి.
  • మూడో విడతలో భాగంగా 36,442 వార్డు స్థానాల ఎన్నికల నిర్వహించనున్నారు. ఇందుకోసం 89,603 మంది నామినేషన్లు దాఖళయ్యాయి.
  • శనివారం నాటికి మూడో విడత నామినేషన్లు ముగిశాయి. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు మొత్తం కలిపి 1,16,880 నామినేషన్లు దాఖలయ్యాయి.
  • సర్పంచ్ పదవులకు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,962 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలో 1,344, సిద్దిపేటలో 1,192, రంగారెడ్డి జిల్లాలో 1,185 నామినేషన్లు వేశారు.
  • రాష్ట్రవ్యాప్తంగా మూడో విడతలో 11 సర్పంచి పదవులకు ఎవరూ నామినేషన్‌ వేయలేదు. ఇందులో అత్యధికంగా ఆరు స్థానాలు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉన్నాయి.

డిసెంబర్ 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 9న అధికారులు ప్రకటిస్తారు. ఇదే సమయంలో గుర్తుల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పోలింగ్ డిసెంబర్ 17వ తేదీన నిర్వహిస్తారు.

మొదటి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు డిసెంబర్‌ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. రెండో విడత పోలింగ్ ప్రక్రియ డిసెంబర్ 14వ తేదీ నిర్వహిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.

ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది.నవంబర్ 19 నుంచి డిసెంబరు 9 వరకు గ్రామాల్లో చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అర్హులైన మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More