డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల.. అమల్లోకి ఎన్నికల కోడ్

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది.

Published on: Nov 25, 2025, 18:28:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం ఏర్పాట్లు మెుదలుపెట్టాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమదిని తాజాగా వివరాలను వెల్లడించారు.

తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు
తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు

డిసెంబర్ 11న తొలి విడత ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉండనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది. ఒక దశకు మరో దశకు మధ్య రెండు రోజుల తేడా ఉంటుంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

ఈ నెల 27వ తేదీ నుంచి మెుదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. అలాగే 30వ తేదీన రెండో దశ, డిసెంబర్ 3న మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. మూడు విడుతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఫేజ్‌ల వారీగా పోలిగ్ రోజే ఉంటుందన్నారు.

రాష్ట్రంలో కోటీ 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమదిని చెప్పారు. గతంలో కొన్ని కారణాలతో ఎన్నికల వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. ఇప్పుడు సర్పంచ్, వార్డు మెంబర్స్ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

'మొత్తం 31 జిల్లాలోని 12, 760 పంచాయతీలు, లక్షా 13,534 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తొలి దశలో 4,200 సర్పంచ్‌ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు ఉంటాయి. రెండో విడతలో భాగంగా 4,333 సర్పంచ్‌ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 4,159 సర్పంచ్‌ స్థానాలు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తాం. ఎలక్షన్ అబ్జార్వర్లను ఇప్పటికే నియమించాం. ఓటర్ల జాబితాతోపాటుగా అన్ని వివరాలు మా వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి.' అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More