నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు భారీ వర్షాలు.. సెన్యార్ తుపాను ఏపీలో తీరం దాటుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

Published on: Nov 25, 2025, 10:54:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాల కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, రాయలసీమ ప్రాంతాలలో నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మలక్కా జలసంధి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడన ప్రాంతం బలపడే సంకేతాలను చూపిస్తోందని, మంగళవారం దక్షిణ అండమాన్ సముద్రంపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

సెన్యార్ తుపాను ప్రభావం
సెన్యార్ తుపాను ప్రభావం

నవంబర్ 26 నాటికి సెన్యార్ తుపానుగా మారే మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నాటికి కొమోరిన్, దాని పరిసర ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాలలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మరింతగా మారే అవకాశం ఉంది. కొన్ని రోజుల కిందట ఏపీ తీరప్రాంతాలను మెుంథా తుపాను ఘోరంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు సెన్యార్ తుపాను ఎటువైపు దూసుకొస్తుందో అనే ఆందోళన నెలకొన్నది.

అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు, బలమైన గాలులు, సముద్రాలు అల్లకల్లోలంగా ఉంటాయని వాతావరణ నిపుణులు సూచించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాబోయే కొద్ది రోజులు అధికారిక అప్డేట్స్ నిశితంగా పరిశీలించాలని కోరుతున్నారు. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఒకటిగా విలీనం కావచ్చు లేదా ఒకటి బలహీనపడవచ్చు అని ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా అన్నారు. సెన్యార్ తుపానుగా మారిన తర్వాత ఏపీ తీరాన్ని తాకుతుందో లేదో అని ఇప్పుడే అంచనా వేయడం కష్టమని చెప్పారు.

ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తర్వాత వాయుగుండంగా 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా మారే ఛాన్స్ ఉంది.

అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉంది. ఒకవేళ తుపాను ఏపీలో తీరందాటితే ఆ ప్రభావం కోస్తా జిల్లాలపై ఎక్కువగా పడనుంది. ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయి. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. అయితే ఏపీలో తుపాను తీరం దాటుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More