గ్రామ పంచాయతీ ఎన్నికలు - రిజర్వేషన్లు ఖరారు, జీవో జారీ చేసిన సర్కార్

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవోను విడుదల చేసంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేసింది.

Published on: Nov 22, 2025, 13:54:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవోను విడుదల చేసంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్‌లను రొటేషన్‌ పద్ధతిలో అమలు చేయాలని జీవోలో పేర్కొంది. వంద శాతం ఎస్టీలు ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలు అన్నీ ఎస్టీలకే రిజర్వ్‌ అవుతాయని స్పష్టం చేసింది.

పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ ఎన్నికలు

వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచులకు 2011 సెన్సస్ ఆధారంగా( బీసీ సర్పంచ్ అభ్యర్థులకు 2024 కుల సర్వే) రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే తీర్పులున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల జీవోకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో… తెలంగాణ ప్రభుత్వం 50 శాతంలోపే రిజర్వేషన్లతోనే ముందుకెళ్లాలని తాజాగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జీవో 46ను జారీ చేసింది.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. డిసెంబర్ 2 వారంలోని కొన్ని తేదీల్లో పోలింగ్ జరిపేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఈసీ అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఏది ఏమైనా డిసెంబర్ 3 వారం కంటే ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియ షురూ అయింది. ఈనెల 23 వరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఈనెల 23వ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల ప్రచురణ ఉంటుంది. ఇక రాష్ట్రంలో ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించి… ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే కసరత్తు చేస్తోంది.

ఈనెల 26 లేదా 27వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో మున్సిపాలిటీలు మినహా గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. డిసెంబర్ నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More