హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులు మృతి - వెలుగులోకి సీసీ పుటేజీ
హైదరాబాద్ లోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లోని మలక్ పేటలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వాహేద్ నగర్‌లో చోటు చేసుకుంది.

బైక్ పై వెళ్తుండగా….
ప్రాథమిక వివరాల ప్రకారం…. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు ఇటీవలనే హైదరాబాద్ కు వచ్చారు. దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలో నివసిస్తున్న తమ కుమార్తె వద్దకు వచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం సాయంత్రం ట్యాంక్ బండ్ చూసేందుకు వారిద్దరూ బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలోనే మలక్ పేట వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి బైక్ ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సీపీ పుటేజీ బయటికొచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్ష కోసం తరిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.
బోల్తా పడిన బస్సు:
మరోవైపు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ వద్ద జరిగింది. మణుగూరు నుంచి పాల్వంచ వెళుతున్న KLR ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సు మొండికుంట అడవి ప్రాంతంలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో సుమారుగా బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

