TSCPSEU : పెద్దపల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల సన్నాహక సమావేశం - 'పాత పెన్షన్' విధానం అమలుకు డిమాండ్

పాత పెన్షన్' సాధనే తమ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ స్పష్టం చేసింది. పెద్దపల్లి జిల్లాలో సన్నాహక సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ… ఐక్య పోరాటాల ద్వారానే  కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకోగలమని పిలుపునిచ్చారు.

Published on: Mar 12, 2026 11:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హల్ లో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో సిపీఎస్ సన్నాహక సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ హాజరయ్యారు.

సిపీఎస్ సన్నాహక సమావేశం
సిపీఎస్ సన్నాహక సమావేశం

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ… సీపీఎస్ (CPS) విధానంలో రిటైర్మెంట్ ల సంఖ్య రోజు రోజు కు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,316 రిటైర్ అయ్యారని…. వారికి ప్రస్తుత కంట్రిబ్యూటరీ పెన్షన్ కేవలం 3000 లోపు మాత్రమే అని వాపోయారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ జీవితం అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐక్య పోరాటాల ద్వారానే ఉద్యోగులు కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకోగలమని వారు స్పష్టం చేశారు.

టి.ఎన్. జి.ఓ అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ… ​ఉద్యోగులు విభేదాలను పక్కన పెట్టి ఒకే తాటిపైకి రావాలన్నారు.​రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ “పాత పెన్షన్ (OPS) మన హక్కు-అది భిక్ష కాదు” అని స్పష్టం చేశారు. దీనిని సాధించుకునే వరకు విశ్రమించే ప్రసక్తి లేదన్నారు.

ఈ సమావేశం సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. వారి వివరాలు చూస్తే….

  • జిల్లా అధ్యక్షులు - శ్రీనివాస్ యాదవ్.
  • జిల్లా ప్రధాన కార్యదర్శి - సంపత్.
  • జిల్లా కోశాధికారి - ప్రేమ్
  • జిల్లా ఉపాధ్యక్షుడు - శ్రీనివాస్ -
  • జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు - టి.శ్రీధర్
  • జాయింట్ సెక్రటరీ - సాయి చరణ్ ల్యాండ్స్ & సర్వే
  • ఆర్గనైసింగ్ సెక్రెటరీ - రఘుపతి
  • మహిళ ఉపాధ్యక్షురాలు - కె.వనజ
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More