రైతుల పంట రుణాల రీషెడ్యూలింగ్ చేయాలి.. కొత్త రుణాలు సకాలంలో ఇవ్వాలి : భట్టి
రైతులకు బ్యాంకులు అండగా నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రైతులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
హైదరాబాద్ ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(SLBC)తో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావం, కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు బ్యాంకులు పూర్తి అండగా ఉండాలని భట్టి విక్రమార్క కోరారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పంట రుణాల రీషెడ్యూలింగ్, పునర్వ్యవస్థీకరణను తక్షణమే చేపట్టాలన్నారు. రాబోయే రబీ సీజన్‌కు కొత్త రుణాలను సకాలంలో మంజూరు చేయాలని చెప్పారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
భట్టి విక్రమార్క
{{^htLoading}} {{/htLoading}}
అర్హులైన విద్యార్థులకు విద్యా రుణాలు, సామాన్యులకు గృహ రుణాలతో పాటు ఎంఎస్ఎంఈ రంగానికి రుణ సదుపాయాలను విస్తరించాలని బ్యాంకులను భట్టి విక్రమార్క కోరారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి, మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి బ్యాంకులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
'రబీ సీజన్‌కు కొత్త పంట రుణాలు సకాలంలో అందించాలి. బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగే పరిస్థితి ఉండకూడదు. విద్య, గృహ రుణాల మంజూరులో బ్యాంకులు సానుకూలంగా ఉండాలి. ఎంఎస్ఎంఈ, మౌలిక సదుపాయాల రంగాలకు రుణాలు పెంచాలి. ఏపీలోని 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాం. 111 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులు ఉన్నాయి. తక్కువ నీటితో సాగు అయ్యే పంటలకు రుణాలు అందించాలి. పంటల మార్పిడి, సూక్ష్మ సేద్యానికి ఆర్థిక సహకారం అందించాలి.' అని భట్టి విక్రమార్క అన్నారు.
రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్కులు కల్పించాలని డిప్యూటీ సీఎం చెప్పారు. 10 నుంచి 15 శాతం రైతు కుటుంబాలకు అదనపు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు అదనంగా రూ.2లక్షల వరకు రుణాల మీద పరిశీలన చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వాలన్నారు. రాజీవ్ యువ వికాసం అమలుకు బ్యాంకర్లు సహకరించాలని చెప్పారు. రైతులకు అండగా ఉండాలని మరోసారి భట్టి స్పష్టం చేశారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.