హైదరాబాద్ NGRIలో ఉద్యోగ ఖాళీలు - ఈ లింక్ తో అప్లయ్ చేసుకోండి
హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ - ఎన్‌జీఆర్‌ఐ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 12 ఖాళీలున్నాయి. https://www.ngri.res.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చెక్ చేసుకోవచ్చు.
సీఎస్‌ఐఆర్- నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NGRI) హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా 12 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఖాళీలను రిక్రూట్ చేస్తారు.

అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జనవరి 5, 2026వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://www.ngri.res.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - సీఎస్‌ఐఆర్- నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్
- ఉద్యోగాలు - మల్టీ టాస్కింగ్ స్టాఫ్
- మొత్తం ఖాళీలు - 12 (అన్ రిజర్వ్ -6, ఈడబ్యూఎస్ 1, ఓబీసీ 4, ఎస్సీ 1)
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
- 2026 జనవరి 5వ తేదీ నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కొన్ని సడలింపులు ఉంటాయి.
- ఎంపికైన వారికి నెలకు రూ.35,973 జీతం చెల్లిస్తారు
- అప్లికేషన్ ప్రాసెస్ - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభ తేదీ - 6 డిసెంబర్ 2025
- దరఖాస్తులకు చివరి తేదీ - 5 జనవరి 2026
- దరఖాస్తు ఫీజు - రూ. 500 చెల్లించాలి.
- ఎంపిక విధానం - రాత పరీక్ష ఆధారంగా(ట్రేడ్ టెస్ట్)
- 150 మార్కులకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు ఉంటంది.
- జనరల్ ఇంటెలిజెన్స్, Quantitative Aptitude, జనరల్ అవెర్నేస్, ఇంగ్లీష్ భాష నుంచి ప్రశ్నలు వస్తాయి.
- అధికారిక వెబ్ సైట్ - https://www.ngri.res.in/
- అప్లికేషన్ లింక్ - https://rectt.ngri.res.in/NgriSecOfficer2025/
- ఏమైనా సందేహాలు ఉంటే career.ngri@csir.res.in కు మెయిల్ చేయవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

