ఏసీబీ వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రవాణాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న కిషన్… భారీగా అక్రమాస్తులను కూడబెట్టాడు. అక్రమార్జనలో ఆరితేరిన నేపథ్యంలో…. వ్యవహారం ఏసీబీ దృష్టికి వెళ్లింది. పక్కాగా సమాచారం అందుకున్న అధికారులు…. ఏకకాలంలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. దీంతో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ గా పని చేస్తున్న కిషన్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఆయన నివాసంతో పాటుగా ఆయన బంధువులు మరియు సహచరులకు చెందిన మరో 11 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
భారీగా ఆస్తుల చిట్టా…!
ఈ సోదాల్లో నిజామాబాదులో లహరి ఇంటర్నేషనల్ హోటల్‌లో 50 శాతం వాటా, 3000 చదరపు గజాల రాయల్‌ఓక్ ఫర్నిచర్ గల స్థలం, అశోక టౌన్‌షిప్‌లో 2 ఫ్లాట్లు మరియు 10 ఎకరాల వాణిజ్య భూమి ఉన్నట్లు తేలింది.
సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పాలీహౌస్ మరియు షెడ్, రెండు వాహనాలు (ఇన్నోవా క్రిస్టా మరియు హోండా సిటీ) మరియు 1000.4 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటుగా రూ.1.37 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉన్నట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులన్నింటి మొత్తం విలువ సుమారు రూ.12.72 కోట్లు (దస్తవేజు విలువ ప్రకారం) ఉండగా… బహిరంగ మార్కెట్ లో అయితే రూ. 200 కోట్లకుపైగానే ఉండే అవకాశం ఉంది.
మంగళవారం సోదాలు ముగిసిన అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉన్నట్లు ఏసీబీ ప్రకటించింది.
{{/usCountry}}మంగళవారం సోదాలు ముగిసిన అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉన్నట్లు ఏసీబీ ప్రకటించింది.
{{/usCountry}}ఇక ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.