హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు మెట్రో-ఆర్టీసీ సేవల కోసం కామన్ పాస్‌ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే హైదరాబాద్ మెట్రో-టీజీఎస్ఆర్టీసీ సేవల కోసం ఉద్దేశించిన కామన్ మొబిలిటీ కార్డ్(Common Mobility Card) ధరలను పునఃపరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుండి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైలు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సులలో ప్రయాణించడానికి వీలుగా ఈ కామన్ మొబిలిటీ కార్డ్ అక్టోబర్ 2, 2026న ప్రారంభించారు. దీని నెలవారీ పాస్ ధర రూ.8,500(ఇందులో హైదరాబాద్ మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500 ఉన్నాయి). అలాగే రోజువారీ పాస్ ధర రూ.400 (ఇందులో హైదరాబాద్ మెట్రో వాటా రూ.300, టీజీఎస్ఆర్టీసీ వాటా రూ.100 ఉన్నాయి). ఈ కార్డును ప్రవేశపెట్టిన వెంటనే.. దీని ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.
ఈ పాస్‌లో మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్(MMTS)తో పాటు, షేర్డ్ ఆటోలు, ఇతర రవాణా మార్గాల ద్వారా లభించే లాస్ట్-మైల్ కనెక్టివిటీ వంటివి చేర్చలేదని కూడా కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అధిక ధరలతో ప్రజలపై భారం మోపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తుది నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఈ కామన్ పాస్ ఉంటే.. మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటిద్వారా హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోలో ఎక్కడి నుంచైనా వెళ్లవచ్చు. ప్రస్తుతం ఉన్న రేట్లు అధికంగా ఉన్నట్టుగా అభిప్రాయాలు వస్తున్నాయి. అందుకే పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదంటున్నారు దీంతో ప్రభుత్వం కామన్ మెుబిలిటీ పాస్ ధరలను తగ్గించనుంది.
{{/usCountry}}ఈ కామన్ పాస్ ఉంటే.. మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటిద్వారా హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోలో ఎక్కడి నుంచైనా వెళ్లవచ్చు. ప్రస్తుతం ఉన్న రేట్లు అధికంగా ఉన్నట్టుగా అభిప్రాయాలు వస్తున్నాయి. అందుకే పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదంటున్నారు దీంతో ప్రభుత్వం కామన్ మెుబిలిటీ పాస్ ధరలను తగ్గించనుంది.
{{/usCountry}}