...
...
Next Story

పులుల సంఖ్య లెక్కించేందుకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. ఇలా అప్లై చేయండి

వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్‌లో చేరాలనుకునేవారికి మరో అవకాశం. దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు.

Published on: Nov 23, 2025, 11:11:51 IST
Advertisement

ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్‌లో చేరడానికి దరఖాస్తుల గడువును పొడిగించారు. వచ్చే జనవరిలో జరిగే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్‌లో చేరాలనుకునే వారి దరఖాస్తుల గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది. ఇప్పటివరకు జనవరి 17 నుండి 24 వరకు జరిగే పులుల అంచనా సమయంలో పులుల సంఖ్య, అటవీ రకం డేటా సేకరణ కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి దాదాపు 3,800 మంది సైన్ అప్ చేశారని అటవీ శాఖ విభాగం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

పులుల గణన
పులుల గణన

ప్రభుత్వ సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా పనిచేయవచ్చు. కానీ పులుల అంచనా ప్రక్రియకోసం సెలవు తీసుకొవాల్సి ఉంటుంది. దీనికోసం వారి స్వంత సమయం కేటాయించాలి. ఆసక్తి ఉన్నవారు https://tinyurl.com/aite2026tg ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా aite2026tg@gmail.com కు ఇమెయిల్ పంపవచ్చు. 9803338666కు వాట్సాప్ ద్వారా సందేశం పంపవచ్చు. 18004255364, 04023231440కు కాల్ చేయవచ్చు.

ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 కార్యక్రమాన్ని జనవరి 17 నుంచి జనవరి 24 వరకు నిర్వహించనున్నారు. స్వచ్ఛంద సేవకులు, యువకులు, విద్యార్థులు పులుల గణన కార్యక్రమంలో పాల్గొనాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వాలంటీర్లకు అవసరమైన శిక్షణ ఇస్తారు. అడవుల్లో వన్యప్రాణుల గణనకు ఎర్న్​ యువర్​ స్ట్రేప్స్​ యాప్‌లో కాగిత రహితంగా పులుల గణన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నిజానికి పులుల గణన కోసం ముందుగా నవంబర్ 22 వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఆ తర్వాత నవంబర్ 30 వరకు పెంచారు. శాకాహార జంతువులతో పాటు మాంసాహార జంతువుల గణన ఉండనుంది. పులుల పాదముద్రలు, మలం, కెమెరా ట్రాప్స్ అమర్చడం, ఇతర సాంకేతిక పద్ధతులను ఉయోగించడంవంటి వాటిపై శిక్షణ ఇస్తారు. పులుల సంఖ్యను అత్యంత కచ్చితంగా లెక్కిస్తారు అధికారులు.

ఎన్ని పులులు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకునేందుకు ప్రభుత్వం నాలుగేళ్లకోసారి గణన చేస్తోంది. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులని తాడోబా, తిప్వేశ్వర్, ఇంద్రావతి అడవుల నుంచి ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లోకి పులులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం జన్నారంలో కవ్వాల్ పులల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe