కొత్త పింఛన్లపై తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి పంపిణీ!

Cheyutha Pension : తెలంగాణలో కొత్త పింఛన్లకు అర్హులు వెంటనే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే సెప్టెంబర్15తో దరఖాస్తు ముగుస్తుంది. ఇప్పటికే దరఖాస్తు గడువును పెంచిన విషయం తెలిసిందే.

Published on: Sep 15, 2026, 14:07:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని నిరుపేదలు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ఇతరులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. కొత్తగా ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం కల్పించిన సమయం నేటితో (సెప్టెంబర్ 15) ముగియనుంది. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

పెన్షన్లపై అప్డేట్
పెన్షన్లపై అప్డేట్

పింఛన్ల పెంపు, కొత్త లబ్ధిదారుల చేరికపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన లభించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.8 లక్షలకు పైగా మంది కొత్త పింఛన్ల కోసం అప్లై చేసుకున్నారు. దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటంతో ఏ ఒక్క నిజమైన లబ్ధిదారునికి అన్యాయం జరగకుండా చూసేందుకు ప్రభుత్వం స్క్రూటినీ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించింది.

వచ్చిన అర్జీలను పక్కాగా వడపోసేందుకు రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలను ప్రారంభించనున్నారు. ఈ నెల 25 నాటికి వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నెలాఖరు వరకు అధికారులు నేరుగా అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వారి ఆర్థిక స్థితిగతులు, వయస్సు ధృవీకరణ పత్రాలు, ఇతర అర్హతలను ప్రత్యక్షంగా తనిఖీ చేస్తారు.

అర్హులైన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైన వెంటనే.. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నూతన పింఛన్ల పంపిణీని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అర్హులైన పేదలందరూ ఈ చివరి అవకాశాన్ని వదులుకోకుండా తక్షణమే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు చెప్పారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయికి వెళ్లి దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితులు, అర్హతలను స్వయంగా తనిఖీ చేస్తారు. పురపాలక, నగర పాలక సంస్థల బిల్ కలెక్టర్లు ఈ పరిశీలన బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ వేగవంతంగా అత్యంత పారదర్శకంగా సాగేందుకు స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సహాయాన్ని కూడా తీసుకోనున్నారు.

ఆన్‌లైన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మీ ఆధార్ కార్డ్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఉపయోగించి స్టేటస్ తెలుసుకోవచ్చు.

చేయూత పథకం అధికారిక పోర్టల్ https://www.cheyutha.telangana.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

హోమ్ పేజీ ప్రత్యక్షమైన తర్వాత అక్కడ కనిపిస్తున్న 'Quick Search' (క్విక్ సెర్చ్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

అందులో కనిపించే 'New Sanctions Applicants Search' అనే లింక్‌ను ఎంచుకోవాలి.

మీ ఆధార్ నంబర్ లేదా మీ అప్లికేషన్ నంబర్‌ను నిర్దేశిత బాక్స్‌లో సరిగ్గా నమోదు చేయాలి.

మీ వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఎంట్రీ చేసి ఉంటే, స్క్రీన్‌పై మీ దరఖాస్తు వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇందులో మీ అప్లికేషన్ నంబర్‌తో పాటు ఏ కేటగిరీ పింఛన్ (వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల మొదలైనవి) కోసం అప్లై చేశారో ప్రాథమిక సమాచారం కనిపిస్తుంది.

తర్వాత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి లేదా పత్రాలను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారు. విచారణలో అన్ని అర్హతలు ఉన్నాయని తేలితే పింఛన్ వస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More