ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ వ్యవసాయ రంగానికి నేలలోని సేంద్రీయ కార్బన్(Organic Carbon) తగ్గుదల కొత్త సవాలుగా మారింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో మట్టిలో సేంద్రీయ కార్బన్ స్థాయిలు తక్కువగా లేదా సగటు స్థాయిలో మాత్రమే ఉన్నాయని మట్టి పరీక్షల్లో తేలింది. నేలలో సేంద్రీయ కార్బన్ తగినంతగా ఉంటేనే అది నీటిని పట్టి ఉంచే (తేమ నిలుపుదల) సామర్థ్యాన్ని పొందుతుంది.

అంతేకాకుండా ఇది సూక్ష్మజీవుల కార్యకలాపాలను పెంచడానికి, పంటలకు పోషకాలను అందించడానికి సహాయపడుతుంది. భూమిలో సేంద్రీయ కార్బన్ క్షీణించడం వల్ల మట్టి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా.. వర్షాభావం లేదా ఎండ తీవ్రత పెరిగినప్పుడు పంటలు త్వరగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రైతులు నేల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ నివేదికలు సూచిస్తున్నాయి.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో తెలంగాణలో దాదాపు రెండు లక్షల మట్టి నమూనాల పరీక్షలు నిర్వహించారు. 2019-20లో నిలిచిపోయిన ఈ ప్రక్రియను ఇటీవల పునరుద్ధరించారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. రాష్ట్రంలోని 621 మండలాలకు గానూ 2024-25, 2025-26 సంవత్సరాల్లో ప్రతి మండలం నుంచి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి నామమాత్రంగా పరీక్షలు జరిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
మట్టి పరీక్షల వెల్లడైన ఫలితాలు చూసుకుంటే.. పరీక్షించిన నేలల్లో కేవలం 14 శాతం పరిధిలోనే తగినంత ఉన్నత స్థాయి సేంద్రీయ కార్బన్ ఉన్నట్లు తేలింది. చాలా జిల్లాల్లో నత్రజని లోపం తీవ్రంగా ఉంది. దాదాపు 20 శాతం నేలల్లో భాస్వరం, పొటాషియం స్థాయిలు చాలా తక్కువగా నమోదయ్యాయి.
తెలంగాణలో వెల్లడైన ఫలితాలు దేశవ్యాప్త పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. 'ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్' (ICRIER) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని నేలల్లో కేవలం 25 శాతం మాత్రమే తగినంత సేంద్రీయ కార్బన్ను కలిగి ఉన్నాయి.
{{/usCountry}}తెలంగాణలో వెల్లడైన ఫలితాలు దేశవ్యాప్త పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. 'ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్' (ICRIER) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని నేలల్లో కేవలం 25 శాతం మాత్రమే తగినంత సేంద్రీయ కార్బన్ను కలిగి ఉన్నాయి.
{{/usCountry}}ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల నేలల్లో సేంద్రీయ కార్బన్ స్థాయి 1 శాతం నుండి 1.5 శాతం వరకు ఉండాలి. కానీ దేశంలో దాదాపు 73 శాతం నుండి 76 శాతం వ్యవసాయ భూముల్లో ఇది 0.5 శాతం కంటే తక్కువకు పడిపోయిందని ఐసీఆర్ఐఈఆర్ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.
నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి, తేమను నిలిపి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి ప్రకృతి వ్యవసాయం ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ప్రకృతి వ్యవసాయం చేసే పొలాల్లో దిగుబడి సగటున 11 శాతం ఎక్కువగా నమోదైంది. పెట్టుబడి ఖర్చులు తగ్గడం వల్ల రైతుల నికర ఆదాయం 49శాతం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF)లో చేరింది. అయితే ఈ పద్ధతులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భూముల్లో నేల తేమను ఎంతమేరకు పెంపొందిస్తాయి అనేది రైతులు వీటిని ఎంత పక్కాగా అమలు చేస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.