...
...
Next Story

కేసీఆర్ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది : కేటీఆర్

తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29 అత్యంత కీలకం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష చేశారని గుర్తుచేశారు.

Published on: Nov 29, 2026, 12:01:26 IST
Advertisement

కేసీఆర్ చేపట్టిన దీక్ష ఓ మైలురాయి అని కేటీఆర్ అన్నారు. నవంబర్ 29కి తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష చేశారని చెప్పారు. 'ఒక దీక్ష... ఒక సంకల్పం...ఒక రాష్ట్రం!' ఎని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

దీక్షా దివస్‌ (X)
దీక్షా దివస్‌ (X)

'తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అని ప్రతినబూని ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన మహోన్నత దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది... ఢిల్లీ సర్కార్‌ను గడగడలాడించి, వారి మెడలు వంచింది. తన ప్రాణాలని సైతం లెక్కచేయకుండా కేసీఆర్ నవంబర్ 29, 2009 నాడు చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఒక మైలురాయి. అణిచివేయబడ్డ ఒక నేల విముక్తి కోసం ఒక భూమిపుత్రుడు చేసిన పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లో చిరస్థాయిలో నిలుస్తుంది. చావు నోట్లో తలకాయ పెట్టైనా తెలంగాణ రాష్ట్రానికి, అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి గుర్తింపు తెస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మూడున్నర కోట్ల ప్రజల చిరకాల సంకల్పం సాకారం చేశాడు. నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ!' అని కేసీఆర్ పోస్ట్ చేశారు.

కేసీఆర్ దీక్షాబలం

హరీశ్ రావు కూడా దీక్షా దివస్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేసీఆర్ దీక్షాబలం, అమరుల త్యాగఫలం, నేటి తెలంగాణ రాష్ట్రం అని పేర్కొన్నారు.

ఆత్మబలమే ఆయుధంగా..

వాక్ శక్తే ఇంధనంగా..

నిజాయితీ నిబద్దతలే కవచ కుండలాలుగా..

తెలంగాణ పోరాటాన్ని విజయతీరం చేర్చిన యోధుడు కేసీఆర్ గారు.

పదవులు వదిలి ప్రజలను ఒక్కటి చేసిండు.

ప్రాణాన్నే పణంగా పెట్టి ఢిల్లీ గద్దెను వణికించిండు.

అర్ధ శతాబ్దపు ఆకాంక్షను సాకారం చేసి తెలంగాణను ఆవిష్కరించిండు.

భూమి పుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్

స్వరాష్ట్రంలో సుపరిపాలన చేసిన ప్రగతి సంతకం కేసీఆర్

భవిష్యత్ తరాలలో సైతం స్పూర్తిని వెలిగించే ఉద్యమ పాఠం కేసీఆర్

కేసీఆర్ అంటే తెలంగాణ గర్వం..

కేసీఆర్‌కు తెలంగాణే సర్వం..' అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks