Not A Mahatma Docu Series: కేసీఆర్ దీక్ష వెనుక అసలు నిజమేంటి? ప్రకాష్ రాజ్ షేర్ చేసిన 'నాట్ ఏ మహాత్మ' ట్రైలర్‌తో సంచలనం!

Not A Mahatma Docu Series: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చుట్టూ అల్లుకున్న ఆసక్తికర అంశాలతో 'నాట్ ఏ మహాత్మ' (Not A Mahatma) అనే డాక్యుసిరీస్ రాబోతోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ సిరీస్ ట్రైలర్ లింక్‌ను షేర్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ చర్చ మొదలైంది.

Published on: Nov 25, 2026, 13:15:10 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Not A Mahatma Docu Series: తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల బలిదానాలు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తదితర విషయాలో ఓ డాక్యుమెంట్ సిరీస్ రాబోతుంది. ‘నాట్ ఏ మహాత్మ’ (Not A Mahatma) అనే టైటిల్ ఈ డాక్యు సిరీస్ ట్రైలర్ ను ఇవాళ (నవంబర్ 25) రిలీజ్ చేశారు.

కేసీఆర్ దీక్ష వెనుక అసలు నిజమేంటి? ప్రకాష్ రాజ్ షేర్ చేసిన 'నాట్ ఏ మహాత్మ' ట్రైలర్‌తో సంచలనం! (youtube/ ANAGANAGANA Film Company)
కేసీఆర్ దీక్ష వెనుక అసలు నిజమేంటి? ప్రకాష్ రాజ్ షేర్ చేసిన 'నాట్ ఏ మహాత్మ' ట్రైలర్‌తో సంచలనం! (youtube/ ANAGANAGANA Film Company)

నాట్ ఏ మహాత్మ ట్రైలర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు, ఉద్యోగుల పోరాటాలు, రాజకీయ పార్టీల నిర్ణయాలను నాట్ ఏ మహాత్మ ట్రైలర్ ప్రారంభంలో ఎంతో బలంగా చూపించారు. ఓయూ గడ్డపై విద్యార్థుల నినాదాలు, బతుకమ్మ సంబరాలు, బోనాల కోలాహలం, కొలువులను తాకట్టు పెట్టి పోరాడిన ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదనను దృశ్యరూపంలో కళ్లకు కట్టారు.

కేసీఆర్ దీక్ష

ఉద్యమంలో ఎందరో భాగస్వాములైనా, రాష్ట్ర అవతరణకు ప్రధాన కారణం మాత్రం ఒకే ఒక్క దీక్ష అనే కోణంలో ట్రైలర్ మలుపు తిరుగుతుంది. "కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో" అనే సంచలన నినాదంతో పాటు, అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చేసిన చారిత్రక ప్రకటనను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు.

ట్రైలర్ చివర్లో ఆసక్తికర ట్విస్ట్

1 నిమిషం 52 రెండు సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చివరి కొన్ని సెకన్లు ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. కేంద్రం ప్రకటన తర్వాత తెరవెనుక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ ఈ డాక్యుసిరీస్ అసలు ఉద్దేశాన్ని సూచిస్తోంది.

"కేసీఆర్ నిజంగానే ఫాస్టింగ్ చేసుంటాడంటావా?" అనే ప్రశ్నకు, "చాలా కాన్‌స్పిరసీ థియరీస్ ఉన్నాయ్" అనే సమాధానం రావడం, వెంటనే "హేయ్ కెమెరా కట్ చెయ్" అంటూ దృశ్యం ఆగిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

"ది ట్రూత్ బిహైండ్ కేసీఆర్స్ ఫాస్ట్ ఫర్ తెలంగాణ" (తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్ష వెనుక ఉన్న నిజం) అనే ట్యాగ్‌లైన్‌తో 'నాట్ ఏ మహాత్మ' టైటిల్‌ను పరిచయం చేశారు.

ప్రకాష్ రాజ్ పోస్ట్

రాజకీయ, సామాజిక అంశాలపై ఎప్పుడూ తన అభిప్రాయాలను బలంగా వినిపించే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ డాక్యుసిరీస్ ట్రైలర్ లింక్‌ను పంచుకోవడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఇప్పటికే రాజకీయ వర్గాల్లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ ఈ ట్రైలర్ వేగంగా చర్చనీయాంశమైంది. 4 ఎపిసోడ్ల ఈ డాక్యుసిరీస్‌లో ఎలాంటి కొత్త కోణాలను ఆవిష్కరించబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

దర్శకుడు ఎవరంటే?

అనగనగా ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ డాక్యుసిరీస్‌కు పట్టాభి ఆర్ చిలుకూరి క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఆనంద్ రంగా ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం 'కమింగ్ సూన్' అంటూ ట్రైలర్‌ను మాత్రమే విడుదల చేసిన మేకర్స్, ఈ డాక్యుసిరీస్ విడుదల తేదీ, స్ట్రీమింగ్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.