యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 2026-27 ఏడాది నుంచి డిగ్రీ, పీజీ కోర్సులు

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య వెయ్యికి చేరింది.

Published on: Jan 1, 2026, 06:01:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, డిసెంబర్ 2025 నాటికి 1,000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులను ఉద్యోగాలు వచ్చే విధంగా, పారిశ్రామిక అవసరాలకు సన్నద్ధం చేయడానికి ఈ విశ్వవిద్యాలయం స్థాపించారు. వెయ్యి మందికి శిక్షణ లక్ష్యాన్ని సాధించడం ద్వారా నైపుణ్య విద్యా రంగంలో ఒక ముఖ్యమైన సంస్థగా అవతరించింది.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ

విశ్వవిద్యాలయం ప్రస్తుతం లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ సైన్సెస్ వంటి రంగాలలో నైపుణ్యం ఆధారిత శిక్షణా కార్యక్రమాలను అందిస్తోంది. స్వల్పకాలిక, సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధిని కల్పించడానికి విద్యార్థులకు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలతో శిక్షణ ఇస్తున్నారు.

మైక్రోసాఫ్ట్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, జీఎంఆర్ కార్గోతో సహా అనేక ప్రముఖ సంస్థలు విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి ముందస్తు మద్దతుతో ఈ కంపెనీలు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాక్టికల్ శిక్షణ, ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయని అధికారులు తెలిపారు.

డాక్టర్ రెడ్డీస్ ఫార్మా అసోసియేట్ అప్రెంటిస్ కోర్సులో చేరిన ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. ఆరు నెలల కార్యక్రమం విలువైన ఆన్-ది-జాబ్ శిక్షణతో పాటు బలమైన ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తుందని అన్నారు. 'కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అప్రెంటిస్‌షిప్ స్టైపెండ్, ప్లేస్‌మెంట్ అందించారు.' అని ఆమె చెప్పారు.

జాబ్ గ్యారెంటీ ఆధారిత విధానంతో 2026–27 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించడానికి విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దీనికి ఆగస్టు 1, 2024న శంకుస్థాపన చేశారు. ఇది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) నమూనాలో నడుస్తుంది.

ముఖ్యమంత్రి విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆనంద్ మహీంద్రా బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ వి.ఎల్.వి.ఎస్.ఎస్. సుబ్బారావు ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో 57.8 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణం జరుగుతోంది. ఈ క్యాంపస్‌లో 43 తరగతి గదులు, 600 పడకల హాస్టల్, 84,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ప్రయోగశాల బ్లాక్ ఉంటాయి. క్యాంపస్ మొదటి దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కోర్సులు ఐఐఐటీ హైదరాబాద్‌లోని తాత్కాలిక క్యాంపస్ నుండి అందిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More