సికింద్రాబాద్ నగరంలో డెలివరీ ఏజెంట్లపై వరుసగా జరుగుతున్న దాడుల పరంపరలో మరో విచారకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫుడ్ డెలివరీ కొన్ని నిమిషాలు ఆలస్యమైందనే సన్నకారణంతో ఒక డెలివరీ బాయ్‌పై దంపతులు అత్యంత దారుణంగా భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి నగర్‌లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశిష్ అనే డెలివరీ ఏజెంట్ నిత్యం లాగే కస్టమర్ ఆర్డర్ చేసిన పార్శిల్‌ను అందజేసేందుకు వాసవి నగర్ వెళ్లాడు. అయితే ఆర్డర్ బుక్ చేసే సమయంలో కస్టమర్ యాప్‌లో తప్పు లొకేషన్ నమోదు చేయడంతో, సరైన చిరునామాను వెతుక్కుంటూ ఆశిష్ అక్కడికి చేరుకునేసరికి కొన్ని నిమిషాల ఆలస్యమైంది.
డెలివరీ ఆలస్యాన్ని నిలదీస్తూ ఆ దంపతులు ఆశిష్‌తో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. డెలివరీ ఏజెంట్ తప్పు లొకేషన్ వల్ల ఆలస్యమైందని ఎంత వివరణ ఇచ్చినా వినకుండా దంపతులు ఆగ్రహంతో ఊగిపోయారు. గొడవ తారస్థాయికి చేరడంతో, ఆ దంపతుల్లోని మహిళ ఆశిష్‌పై భౌతిక దాడికి దిగింది. అసభ్య పదజాలంతో దూషిస్తూ అతడిపై చెయ్యి చేసుకుంది.
ఈ దారుణ దృశ్యాలన్నీ సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది. బాధితుడు ఆశిష్ వెంటనే కార్ఖానా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి దంపతులపై రాతపూర్వక ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
నగరంలో రోజురోజుకూ డెలివరీ ఏజెంట్లపై పెరిగిపోతున్న ఇటువంటి దాడులపై గిగ్ వర్కర్లు, వివిధ డెలివరీ సంస్థల ఏజెంట్లు తీవ్ర నిరసన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ, వాన, ట్రాఫిక్ కష్టాలను ఓర్చి సమయానికి సేవలు అందించే తమపై ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదని వారు ఆవేదన చెందారు.
{{/usCountry}}నగరంలో రోజురోజుకూ డెలివరీ ఏజెంట్లపై పెరిగిపోతున్న ఇటువంటి దాడులపై గిగ్ వర్కర్లు, వివిధ డెలివరీ సంస్థల ఏజెంట్లు తీవ్ర నిరసన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ, వాన, ట్రాఫిక్ కష్టాలను ఓర్చి సమయానికి సేవలు అందించే తమపై ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదని వారు ఆవేదన చెందారు.
{{/usCountry}}ఈ ఘటనకు కారణమైన దంపతులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏజెంట్లకు రక్షణ కల్పించేలా ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని డెలివరీ బాయ్స్ యూనియన్లు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి.