వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం కోసమో, అధికారం హోదాను అనుభవించడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులోని ప్రజా భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, దారి దోపిడీదారులు, బందిపోట్ల నుంచి తెలంగాణ ఆస్తులను వనరులను రక్షించి, వాటిని ప్రజలకు అందజేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.

'సింగరేణి బొగ్గు సంస్థలకు టెండర్లపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కొత్త పలుకులో తనకు తోసింది రాశారు. ఓ కట్టు కథనాన్ని ఎవరి ప్రయోజనం కోసమో వండి వార్చారు. టెండర్ల నిబంధనలు సింగరేణి బోర్డ్ ఖరారు చేస్తుంది. మంత్రికి సంబంధం ఉండదు. ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్లు రద్దు చేయాలని సూచించాను. తాను సింగరేణి బోర్డు సభ్యులకు చెప్పి వెంటనే సదరు బోర్డు మాత్రం టెండర్లు పిలిచిన ఇంకా ఎవరూ రాలేదని చెప్పారు. అయినప్పటికీ టెండర్లు రద్దు చేసి ఫ్రెష్‌గా పిలవమని సూచించా.' అని భట్టి విక్రమార్క అన్నారు.
తాను దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవాడినని భట్టి విక్రమార్క గుర్తుచేసుకున్నారు. వైఎస్‌పై ఉన్న కోపంతో తనపై ఈ వార్త రాసినట్టుగా కనిపిస్తుందని ఆరోపించారు. ఈ వార్త వల్ల అధికారులకు, మంత్రులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. తాను ఆత్మగౌరవం కోసం బతుకుతామని, దోపిడిదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులమంతా రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని, చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని భట్టి హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి గాలికి రాలేదని 40 సంవత్సరాలుగా సభలో, బయట ఉండి ప్రజల కోసం పోరాటాలు చేసి వచ్చానన్నారు. ఏం ఆశించి రాశారో, ఎవరి మెప్పు కోసం రాశారో బయటపడుతుందని అన్నారు. ఈ కథనంపై రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలని తాను స్పందించడం జరిగిందన్నారు. త్వరలో పూర్తి వివరాలతో అన్ని విషయాలు వివరిస్తానని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
{{/usCountry}}ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులమంతా రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని, చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని భట్టి హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి గాలికి రాలేదని 40 సంవత్సరాలుగా సభలో, బయట ఉండి ప్రజల కోసం పోరాటాలు చేసి వచ్చానన్నారు. ఏం ఆశించి రాశారో, ఎవరి మెప్పు కోసం రాశారో బయటపడుతుందని అన్నారు. ఈ కథనంపై రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలని తాను స్పందించడం జరిగిందన్నారు. త్వరలో పూర్తి వివరాలతో అన్ని విషయాలు వివరిస్తానని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
{{/usCountry}}