...
...
Next Story

తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ - టైమింగ్స్, రూట్ వివరాలు ఇవే!

Dhanbad Coimbatore Amrit Bharat Express : ధన్‌బాద్ - కోయంబత్తూర్ మధ్య నూతన అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వారానికి ఒకసారి నడిచే ఈ రైలు…. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.

Published on: Aug 25, 2026, 12:24:28 IST
Advertisement

Dhanbad Coimbatore Amrit Bharat Express : తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మంచి శుభవార్త అందించింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్ మధ్య నూతన 'అమృత్ భారత్ వారపు ఎక్స్‌ప్రెస్' (రైలు నంబర్లు 22363/22364) ప్రారంభానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు ధన్‌బాద్ నుంచి ఆగస్టు 22, 2026న, కోయంబత్తూర్ నుంచి ఆగస్టు 25, 2026న ప్రారంభమయ్యాయి.

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బల్హార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తిరుప్పూర్ వంటి కీలక స్టేషన్ల మీదుగా సాగుతుంది. తెలంగాణ, ఏపీ మీదుగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.

ట్రైన్ నంబర్ 22363 (ధన్‌బాద్ - కోయంబత్తూర్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ) :రైలు ప్రతి శనివారం సాయంత్రం 16:10 గంటలకు ధన్‌బాద్‌లో బయలుదేరి, సోమవారం సాయంత్రం 18:30 గంటలకు కోయంబత్తూర్ చేరుకుంటుంది.

  • గోమో : శనివారం సాయంత్రం 16:40 / 16:42
  • బల్హార్షా : ఆదివారం రాత్రి 21:10 / 21:15
  • సిర్పూర్ కాగజ్‌నగర్ : రాత్రి 22:04 / 22:05
  • మంచిర్యాల : రాత్రి 22:44 / 22:45
  • పెద్దపల్లి : రాత్రి 23:09 / 23:10
  • వరంగల్ : సోమవారం అర్ధరాత్రి 00:08 / 00:10
  • మహబూబాబాద్ : రాత్రి 01:09 / 01:10
  • ఖమ్మం : రాత్రి 01:49 / 01:50
  • విజయవాడ : తెల్లవారుజామున 03:45 / 03:55
  • తిరుప్పూర్ : సోమవారం సాయంత్రం 17:03 / 17:05
  • కోయంబత్తూర్ : సోమవారం సాయంత్రం 18:30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్యమైన పారిశ్రామిక, వ్యాపార నగరాలను అనుసంధానిస్తూ సాగే ఈ రైలు సర్వీసు ఉంటుంది. ఫలితంగా వ్యాపారులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe