తెలంగాణలో గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలకు పన్నులు, ఇతర రూపాల్లో వచ్చే సొంత ఆదాయాన్ని ఇకపై ట్రెజరీలతో సంబంధం లేకుండా నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కొత్త ఆదేశాలు జారీయ్యాయి.

ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) చట్టం–2026కు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ జీవో నంబరు 43ను విడుదల చేశారు. ఈ చట్ట సవరణ 2026 అక్టోబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీలు కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా మిగిలిపోకూడదని, గ్రామ స్థాయిలోనే స్వీయ పరిపాలన సాగించే అధికారిక సంస్థలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
గ్రామ పంచాయతీలకు సొంత ఖాతాల ద్వారా పల్లెల సమగ్ర అభివృద్ధికి, ఆర్థిక స్వావలంబనకు ఇది ఎంతో కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. 73వ రాజ్యాంగ సవరణ ఆశయాలకు అనుగుణంగా స్థానిక సంస్థలకు తగిన అధికారాలు, ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇన్నాళ్లూ అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీల నిధుల నిర్వహణలో అనేక సాంకేతిక, పరిపాలనా జాప్యాలు జరిగేవి. కొత్త చట్ట సవరణ ద్వారా వాటికి చెక్ పడింది.
పాత విధానంంలో ట్రెజరీ వ్యవస్థ ఉండేది. వసూలైన పన్నులు, సుంకాలను మొదట ట్రెజరీ ద్వార ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి వచ్చేది. ప్రతీ చిన్న ఖర్చుకు ట్రెజరీ అనుమతి, సుదీర్ఘ బిల్లుల ప్రక్రియ అవసరమయ్యేది. బిల్లులు సకాలంలో మంజూరు కాక అత్యవసర పనులకు జాప్యం జరిగేది.
నూతన విధానంలో సమీపంలోని జాతీయ, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో నేరుగా జమ చేయవచ్చు. గ్రామసభ ఆమోదంతో నేరుగా పంచాయతీ బ్యాంక్ ఖాతా నుంచే నిధులు వినియోగించుకోవచ్చు. తక్షణమే నిధులు అందుబాటులో ఉండి, స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగంగా ఖర్చు చేయవచ్చు.
{{/usCountry}}నూతన విధానంలో సమీపంలోని జాతీయ, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో నేరుగా జమ చేయవచ్చు. గ్రామసభ ఆమోదంతో నేరుగా పంచాయతీ బ్యాంక్ ఖాతా నుంచే నిధులు వినియోగించుకోవచ్చు. తక్షణమే నిధులు అందుబాటులో ఉండి, స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగంగా ఖర్చు చేయవచ్చు.
{{/usCountry}}గ్రామాల్లో తాగునీటి పైప్‌లైన్ లీకేజీలు, పారిశుధ్య పనులు, వీధిలైట్ల మరమ్మతులు, పారిశుధ్య కార్మికుల జీతభత్యాల చెల్లింపుల వంటి అత్యవసర పనులకు ట్రెజరీ అనుమతుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణ వంటి స్థానిక మౌలిక సదుపాయాల పనులు శరవేగంగా పూర్తవుతాయి. పంచాయతీల సొంత ఆదాయాన్ని ఖర్చు చేసే ముందు గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేయడంతో ప్రజాస్వామ్య బద్ధత, పారదర్శకత పెరుగుతాయి.
గ్రామ పంచాయతీలకు లభించే పన్నులు, వసూళ్లు, కేంద్ర/రాష్ట్ర ఆర్థిక సంఘాల గ్రాంట్లు, ఇతర నిధులను సమీపంలోని గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా పోస్టాఫీసు ఖాతాల్లో వెంటనే జమ చేయాలి. నిధుల డిపాజిట్, విత్‌డ్రాయల్ ప్రక్రియలన్నింటినీ కచ్చితమైన డిజిటల్ లేదా బ్యాంకింగ్ రికార్డుల ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ కీలక సంస్కరణ ద్వారా తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయి ఆర్థిక స్వేచ్ఛ లభించి, పల్లెల్లో స్వపరిపాలన మరింత బలపడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.