...
...
Next Story

Ranga Reddy District: ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం - 3 రాష్ట్రాల్లో ఆస్తులు..!

అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా… భారీగా ఆస్తులు బయటపడ్డాయి. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు ప్రకటించారు.

Published on: Dec 5, 2025, 09:43:10 IST
Advertisement

అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుండగా… తాజాగా మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసింది. గురువారం నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి.

6 చోట్ల సోదాలు - భారీగా ఆస్తులు…

ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ అరెస్ట్‌
ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ అరెస్ట్‌

తెలంగాణ ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ మరియు భూ రికార్డుల కార్యాలయములో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులుపై అక్రమ ఆస్తులకేసు నమోదైంది. అతనితో పాటు బంధువులకు సంబంధించిన 6 స్థలాలలో సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భుజాలో ఒక ఫ్లాట్, మహబూబ్ నగర్ లో 4 ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో ఒక రైస్ మిల్లుతో పాటుగా 3 ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురములో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు.

1.6 కిలోల బంగారు మరియు 770 గ్రాముల వెండి ఆభరణాల వంటి స్థిర,చరాస్తులతో పాటు ఐదు లక్షల రూపాయల నగదు కలిగి ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ ప్రకటించింది. కేసు దర్యాప్తులో ఉందని పేర్కొంది.

సోదాల్లో అక్రమ ఆస్తులు:

  • మై హోం భుజాలో ఫ్లాట్
  • నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ / రైస్ మిల్
  • కర్ణాటకలో 11 ఎకరాల స్తిరాస్తికి సంబందించిన డాక్యుమెంట్లు
  • ఏపీలోని అనంతపూర్‌లో 11 ఎకరాల స్థిరాస్తి డాక్యుమెంట్లు
  • మహబూబ్ నగర్‌లో 4 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు
  • నారాయణపేటలో మరో 3 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు
  • 5 లక్షల నగదు
  • 1.6 కిలోల బంగారం
  • 770 గ్రాముల వెండి ఆభరణాలు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks