తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఇందిరమ్మ చీరల పంపిణీ', 'చేయూత' కొత్త పెన్షన్ల నిధుల విడుదల కార్యక్రమం వాయిదా పడింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం (నవంబర్ 19) సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో పాటు ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా, ప్రత్యేకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో అదే రోజున ఈ రెండు కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. దీనితో పాటు కొత్తగా మంజూరైన 4,63,857 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
నవంబర్ 26న జరగనున్న ఈ మెగా ఈవెంట్కు సంబంధించి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈవో దివ్యాదేవరాజన్కు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
ఈసారి మహిళల కోసం ప్రత్యేకంగా నాణ్యమైన చిలకపచ్చ రంగు చీరలను ప్రభుత్వం తయారు చేయించింది. ఇప్పటికే ఈ చీరల నిల్వలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల గోదాములకు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎంపికైన 4.63 లక్షల మందికి పైగా చేయూత లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయింది. కేవలం నిధుల జమ మాత్రమే మిగిలి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన మొత్తం 4,63,857 పింఛన్లలో వివిధ వర్గాల వారికి చోటు కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఈ జాబితాను ఖరారు చేశారు. విభాగాల వారీగా లబ్ధిదారుల సంఖ్య కింది విధంగా ఉంది.
{{/usCountry}}రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన మొత్తం 4,63,857 పింఛన్లలో వివిధ వర్గాల వారికి చోటు కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఈ జాబితాను ఖరారు చేశారు. విభాగాల వారీగా లబ్ధిదారుల సంఖ్య కింది విధంగా ఉంది.
{{/usCountry}}వితంతువులు : 2,77,894 మంది
దివ్యాంగులు : 1,00,224 మంది
ఒంటరి మహిళలు : 53,844 మంది
గీత కార్మికులు : 27,444 మంది
చేనేత కార్మికులు : 4,451 మంది