తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత పెన్షన్ల నిధుల జమ వాయిదా

తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత పెన్షన్ల నిధుల విడుదలను ప్రభుత్వం వాయిదా వేసింది. నిజానికి నవంబర్ 19న వీటి కార్యక్రమాలు జరగాల్సింది.

Published on: Nov 19, 2026, 09:03:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఇందిరమ్మ చీరల పంపిణీ', 'చేయూత' కొత్త పెన్షన్ల నిధుల విడుదల కార్యక్రమం వాయిదా పడింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం (నవంబర్ 19) సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో పాటు ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా, ప్రత్యేకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందిరమ్మ చీరల పంపిణీ, పెన్షన్ల విడుదల వాయిదా
ఇందిరమ్మ చీరల పంపిణీ, పెన్షన్ల విడుదల వాయిదా

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో అదే రోజున ఈ రెండు కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. దీనితో పాటు కొత్తగా మంజూరైన 4,63,857 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

నవంబర్ 26న జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈవో దివ్యాదేవరాజన్‌కు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

ఈసారి మహిళల కోసం ప్రత్యేకంగా నాణ్యమైన చిలకపచ్చ రంగు చీరలను ప్రభుత్వం తయారు చేయించింది. ఇప్పటికే ఈ చీరల నిల్వలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల గోదాములకు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎంపికైన 4.63 లక్షల మందికి పైగా చేయూత లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయింది. కేవలం నిధుల జమ మాత్రమే మిగిలి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన మొత్తం 4,63,857 పింఛన్లలో వివిధ వర్గాల వారికి చోటు కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఈ జాబితాను ఖరారు చేశారు. విభాగాల వారీగా లబ్ధిదారుల సంఖ్య కింది విధంగా ఉంది.

వితంతువులు : 2,77,894 మంది

దివ్యాంగులు : 1,00,224 మంది

ఒంటరి మహిళలు : 53,844 మంది

గీత కార్మికులు : 27,444 మంది

చేనేత కార్మికులు : 4,451 మంది

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More