హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్(CURE) పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇళ్ల కోసం ఇప్పటివరకు ఏకంగా 35,125 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

నగరంలోని వేర్వేరు నియోజకవర్గాల నుంచి అందిన దరఖాస్తుల గణాంకాలు చూస్తే.. ఖైరతాబాద్: 4,394, కుత్బుల్లాపూర్: 4,121, నాంపల్లి: 3,613, మలక్‌పేట్: 2,846, శేరిలింగంపల్లి: 2,530, అంబర్‌పేట్: 2,357, కార్వాన్: 1,574, రాజేంద్రనగర్: 1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్: 1,374, మేడ్చల్: 1,153, బహదూర్‌పురా: 1,135, సనత్‌నగర్: 1,046, మల్కాజిగిరి: 1,033, ఇబ్రహీంపట్నం: 749 దరఖాస్తులు వచ్చాయి. కుకట్‌పల్లి నుంచి 5,233 దరఖాస్తులు రాగా, మహేశ్వరం నుంచి 471 దరఖాస్తులు అందాయి.
పేద వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ పథకాన్ని రూపొందించినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 30 లక్షల నుంచి రూ. 58 లక్షల వరకు విలువ చేసే ఈ ఫ్లాట్లను ప్రభుత్వం కేవలం రూ. 6 లక్షలకే లబ్ధిదారులకు అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలు తాము ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా, ఉంటున్న నియోజకవర్గంలోనే సొంతింటి కల నెరవేర్చుకునే గొప్ప అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందన్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఒకవేళ లాటరీ ద్వారా ఇల్లు కేటాయించబడకపోతే, అభ్యర్థులు చెల్లించిన దరఖాస్తు రుసుము రూ. 10,000 లను తిరిగి రీఫండ్ చేస్తామని అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని, అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గౌతమ్ విజ్ఞప్తి చేశారు.
ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఆగస్టు 20న లాటరీ తీసేందుకు హౌసింగ్ బోర్డు తాత్కాలికంగా తేదీని నిర్ణయించింది. ఇప్పటికే ఇందిరమ్మ హౌస్ టవర్స్ నిర్మాణ పనుల కోసం టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఏడాది వ్యవధిలోనే వీటి నిర్మాణాన్ని పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
{{/usCountry}}ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఆగస్టు 20న లాటరీ తీసేందుకు హౌసింగ్ బోర్డు తాత్కాలికంగా తేదీని నిర్ణయించింది. ఇప్పటికే ఇందిరమ్మ హౌస్ టవర్స్ నిర్మాణ పనుల కోసం టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఏడాది వ్యవధిలోనే వీటి నిర్మాణాన్ని పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
{{/usCountry}}ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు లేదా పూర్తి వివరాల కోసం పౌరులు 040-24603572 కాల్ సెంటర్ నంబర్‌ను సంప్రదించవచ్చు.