డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ.. తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా ప్రెసిడెంట్ థాంక్యూ
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ రహదారికి డోనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్యూ చెప్పారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రహదారికి "డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా గౌరవించబడిన మొదటి అమెరికా అధ్యక్షుడిని తానేనని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏండ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులేట్ ఆనుకుని ఉన్న రహదారికి డోనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

ఈ వారం ప్రారంభంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారతదేశంలో యూఎస్ రాయబారి సెర్గియో గోర్ సంయుక్తంగా అధికారిక నామఫలకాన్ని ఆవిష్కరించిన ఫోటోను ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. 'భారతదేశంలోని హైదరాబాద్‌లో సరికొత్త డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ - ఈ విధంగా గౌరవం పొందిన మొట్టమొదటి యూఎస్ ప్రెసిడెంట్. థాంక్యూ!' అని రాసుకొచ్చారు.
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ సైతం ఈ పరిణామంపై ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. 'హైదరాబాద్‌లో ఇదొక చారిత్రాత్మక క్షణం! తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రహదారిని అధికారికంగా ‘డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా మారుస్తూ నామఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ అద్భుతమైన గుర్తింపునకు తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మన బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనం.' అని కాన్సులేట్ పేర్కొంది.
కొత్తగా పేరు మార్చిన ‘డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజాల కార్యాలయాలకు అత్యంత సమీపంలో ఉంది. ఈ నామకరణం యునైటెడ్ స్టేట్స్‌కు ఇచ్చే గౌరవమని, అలాగే భారత్-యూఎస్ సంబంధాలలో హైదరాబాద్ ఎదుగుతున్న పాత్రకు లభించిన గుర్తింపు అని తెలంగాణ ప్రభుత్వం అభివర్ణించింది.
తెలంగాణ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 'వావ్! జస్ట్ వావ్!! ప్రెసిడెంట్ ట్రంప్ భారతీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని రాహుల్ గాంధీ అంటారు. కానీ తెలంగాణలోని ఆయన ప్రభుత్వమేమో ట్రంప్ పేరును ఒక రహదారికి పెట్టి ఆయనకు అల్టిమేట్ ట్రిబ్యూట్ ఇస్తుంది! ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరయ్యారు, ఈ నిర్ణయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు.' అని పూనావాలా ఎక్స్‌లో ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ మాటలను సీరియస్‌గా తీసుకోవడం లేదని పూనావాలా ఎద్దేవా చేశారు. 'రాహుల్ బాబా మాటలను రేవంత్ రెడ్డి అస్సలు పట్టించుకోరా? గతంలో రాహుల్ అదానీ అదానీ అని జపిస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి అలాగే చేశారు.. నేరుగా వెళ్లి అదానీ గ్రూప్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నారు.' అని పూనావాలా రాశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


