...
...
Next Story

తెలంగాణ వెదర్ అప్డేట్స్ - ఇవాళ, రేపు వర్షాలు..! ఆపై పొడి వాతవరణమే..!

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అయితే ఎల్లుండి నుంచి పొడి వాతావరణం ఉండనుంది.

Published on: Sep 27, 2026, 13:13:41 IST
Advertisement

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలుపడనున్నాయి. ఉరుములు, మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ జిల్లాలకు వర్ష సూచన…

తెలంగాణ వెదర్ రిపోర్ట్
తెలంగాణ వెదర్ రిపోర్ట్

తాజా బులెటిన్ లోని వివరాల ప్రకారం… సెప్టెంబర్ 28 ఉదయం 08:30 వరకు చూస్తే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.

సెప్టెంబర్ 28 ఉదయం 08:30 నుండి సెప్టెంబర్ 29 ఉదయం 08:30 వరకు చూస్తే… గాలుల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ, ఉరుములు-మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈనెల 29 నుంచి పొడి వాతావరణం…

సెప్టెంబర్ 29 ఉదయం నుండి అక్టోబర్ 2వ తేదీ ఉదయం 08:30 వరకు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఎలాంటి భారీ హెచ్చరికలు లేవని ఐఎండీ స్పష్టం చేసింది. తిరిగి అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ మధ్య రాష్ట్రంలో మళ్లీ అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks