కాజీపేట మీదుగా వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.... పలు రైళ్లు రద్దు, మరికొన్ని పాక్షికంగా! లిస్ట్ ఇదే
సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కారణంగా కాజీపేట - బల్హార్షా సెక్షన్ లో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని పాక్షికంగా రద్దు చేయగా… కొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
SCR Train Cancellations : సికింద్రాబాద్, కాజీపేట మార్గాల్లో ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. కాజీపేట - బల్హార్షా సెక్షన్‌లోని జమ్మికుంట - పోత్కపల్లి స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టారు. ఈ ఆధునీకరణ పనుల కారణంగా 2026 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, రీషెడ్యూల్ చేశారు.

రద్దయిన రైళ్ల వివరాలు (సెప్టెంబర్ 10, 2026):
- రైలు నంబర్ 17003 (కాజీపేట - సిర్పూర్ టౌన్)
- రైలు నంబర్ 17004 (బల్హార్షా - కాజీపేట)
పాక్షికంగా రద్దయిన రైళ్లు (సెప్టెంబర్ 10, 2026):
- రైలు నంబర్ 17033 (భద్రాచలం - బల్హార్షా) : ఈ రైలు వరంగల్ వరకు మాత్రమే నడుస్తుంది. వరంగల్ - బల్హార్షా మధ్య సేవలు రద్దయ్యాయి.
- రైలు నంబర్ 17034 (సిర్పూర్ టౌన్ - భద్రాచలం రోడ్) : ఈ రైలు వరంగల్ నుంచి ప్రారంభమవుతుంది. సిర్పూర్ టౌన్ - వరంగల్ మధ్య ప్రయాణం రద్దయింది.
- రైలు నంబర్ 17011 (హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్) : ఈ రైలు కాజీపేట వరకే నడుస్తుంది. కాజీపేట - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య సేవలు ఉండవు.
- రైలు నంబర్ 17012 (సిర్పూర్ కాగజ్‌నగర్ - బీదర్) : ఈ రైలు కాజీపేట నుంచి బయలుదేరుతుంది. సిర్పూర్ కాగజ్‌నగర్ - కాజీపేట మధ్య సేవలు రద్దయ్యాయి.
రీషెడ్యూల్ చేసిన రైళ్లు (60 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతాయి - సెప్టెంబర్ 10, 2026) :
- రైలు నంబర్ 17233 (సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్)
- రైలు నంబర్ 67771 (సిర్పూర్ టౌన్ - కరీంనగర్)
- రైలు నంబర్ 67773 (కరీంనగర్ - బోధన్)
- మార్గమధ్యంలో ఆలస్యంగా నడిచే (రీగ్యులేషన్) రైళ్లు:
- రైలు నంబర్ 22365 (దానాపూర్ - ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు - సెప్టెంబర్ 09, 2026): 75 నిమిషాల ఆలస్యం.
- రైలు నంబర్ 22366 (ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు - దానాపూర్ - సెప్టెంబర్ 09, 2026): 45 నిమిషాల ఆలస్యం.
- రైలు నంబర్ 16031 (చెన్నై సెంట్రల్ - శ్రీమాతా వైష్ణోదేవి కత్రా - సెప్టెంబర్ 10, 2026): 30 నిమిషాల ఆలస్యం.
- రైలు నంబర్ 12622 (న్యూఢిల్లీ - చెన్నై సెంట్రల్ - సెప్టెంబర్ 09, 2026): 30 నిమిషాల ఆలస్యం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

