South Central Railway : 203 కి.మీ కాజీపేట-బల్హార్షా మూడో రైల్వే లైన్ పూర్తి

South Central Railway : గ్రాండ్ ట్రంక్ మార్గంలో సెక్షన్ సామర్థ్యాన్ని పెంచడంపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా దృష్టి సారించింది. కాజీపేట-బల్హర్షా మధ్య 203 కిలోమీటర్ల దూరం విద్యుదీకరణతో కూడిన మొత్తం ట్రిప్లింగ్ ప్రాజెక్టును సుమారు రూ. 3,000 కోట్ల వ్యయంతో విజయవంతంగా పూర్తి చేసింది.

Updated on: Jul 24, 2026, 13:31:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దక్షిణ మధ్య రైల్వే(SCR) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాజీపేట - బల్హార్షా 203 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ట్రిప్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. ఆసిఫాబాద్ రోడ్, సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఉన్న ఆఖరి 11 కిలోమీటర్ల మార్గాన్ని విద్యుదీకరణ, బీబ్రా నదిపై నిర్మించిన ప్రధాన వంతెనతో కలిపి ప్రారంభించడంతో ఈ భారీ ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకుంది.

కాజీపేట-బల్హార్షా రైల్వే లైన్
కాజీపేట-బల్హార్షా రైల్వే లైన్

సుమారు రూ. 3,000 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ట్రిప్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టు ద్వారా దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే 'గ్రాండ్ ట్రంక్ రూట్'లో రైళ్ల రాకపోకలకు ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. దీనివల్ల రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరగడమే కాకుండా వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది.

ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశంతో అనుసంధానించే అత్యంత కీలకమైన రైల్వే కారిడార్లలో కాజీపేట-బల్హార్షా సెక్షన్ ఒకటి. ఈ మార్గంలో బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాలకు సంబంధించిన రైల్వే సైడింగ్‌లు అధికంగా ఉండటంతో, సంవత్సరాలుగా ఇక్కడ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ నెలకొని మార్గం నిండిపోయే స్థితికి చేరింది.

ఈ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే దశలవారీగా పనులు చేపట్టింది. 2016లో మొదటగా రాఘవపురం - మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల మూడో లైన్ పనులు పూర్తయ్యాయి. 2015-16లో మిగిలిన కాజీపేట - బల్హార్షా సెక్షన్ ట్రిప్లింగ్‌కు ఆమోదం లభించింది.

ఈ ప్రాజెక్టులో మొత్తం 203 కిలోమీటర్లలో 159 కిలోమీటర్లు తెలంగాణలో, 44 కిలోమీటర్లు మహారాష్ట్రలో విస్తరించి ఉంది. 2020 నుండి ఈ ప్రాజెక్టులోని వివిధ భాగాలను దశలవారీగా రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది.

మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే బల్హార్షా స్టేషన్ సమీపంలోని స్వల్ప భాగాన్ని మినహాయించి, మిగిలిన మొత్తం 203 కిలోమీటర్ల మార్గం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. కొత్తగా వేసిన మూడో లైన్‌ను బల్హార్షా యార్డ్‌తో అనుసంధానించే ప్రక్రియ మాత్రమే ప్రస్తుతం ప్రగతిలో ఉంది. ప్రాజెక్టును నిర్ణీత సమయంలో విజయవంతంగా పూర్తి చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులు, సిబ్బందిని అభినందించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More