తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం తెలంగాణ యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ — ఈగల్ (EAGLE - Elite Action Group for Law Enforcement) విభాగానికి చెందిన ప్రత్యేక బృందం అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేసింది. ఈ మెరుపు దాడిలో అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 12 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారితోపాటు మొత్తం 10 మంది డ్రగ్ పెడ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ అంతర్జాతీయ ముఠా కదలికలపై ‘ఈగల్’ టాస్క్ ఫోర్స్ గత నెల రోజులుగా అత్యంత రహస్యంగా నిఘా ఉంచింది. పక్కా నిఘా సమాచారం, లభించిన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా సరిగ్గా స్కెచ్ వేసి, ఈ టార్గెటెడ్ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.
థాయిలాండ్ టు హైదరాబాద్
ఈ డ్రగ్స్ మాఫియా ప్రధానంగా థాయిలాండ్ నుండి హైదరాబాద్‌కు హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విదేశాల నుంచి ప్రత్యేక బ్యాగులలో ప్యాక్ చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఈ డ్రగ్స్‌ను నగరానికి స్మగ్లింగ్ చేసేవారు.
అలా తీసుకొచ్చిన ఖరీదైన గంజాయిని హైదరాబాద్‌లోని స్థానిక సబ్-పెడ్లర్లకు విక్రయిస్తూ, వారి ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన యువతకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అసలేమిటీ హైడ్రోపోనిక్ గంజాయి?
సాధారణ గంజాయితో పోలిస్తే ఈ హైడ్రోపోనిక్ గంజాయి ధర అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని సాధారణ నేలపై కాకుండా, మట్టి లేకుండా కేవలం ప్రత్యేకమైన పోషక విలువలు గల నీటి ద్రావణాలు, నియంత్రిత ఉష్ణోగ్రత కలిగిన ఇండోర్ ల్యాబ్‌లలో కృత్రిమ కాంతి సహాయంతో పండిస్తారు.
ఇందులో ఉండే టి.హెచ్.సి (THC - Tetrahydrocannabinol) శాతం సాధారణ గంజాయి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే దీనికి డ్రగ్స్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్, ధర ఉంటాయి. విదేశాల నుంచి విమానాల ద్వారా లేదా కార్గో సర్వీసుల ద్వారా దీనిని గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తుంటారు.
ముమ్మరంగా సాగుతున్న విచారణ
{{/usCountry}}ఇందులో ఉండే టి.హెచ్.సి (THC - Tetrahydrocannabinol) శాతం సాధారణ గంజాయి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే దీనికి డ్రగ్స్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్, ధర ఉంటాయి. విదేశాల నుంచి విమానాల ద్వారా లేదా కార్గో సర్వీసుల ద్వారా దీనిని గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తుంటారు.
ముమ్మరంగా సాగుతున్న విచారణ
{{/usCountry}}ప్రస్తుతం అరెస్ట్ అయిన 10 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ సిండికేట్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? హైదరాబాద్‌లో వీరికి సహకరిస్తున్న స్థానిక డ్రగ్ లార్డ్స్ ఎవరు? విదేశాల నుంచి నిధులు ఎలా బదిలీ అవుతున్నాయి? అనే కోణంలో ‘ఈగల్’ టాస్క్ ఫోర్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి లింకులను త్వరలోనే ఛేదిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.