హైదరాబాద్‌లో రౌడీషీటర్ల పైశాచికత్వం.. బాలికకు గంజాయి తాగించి అత్యాచారం!

హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. రౌడీషీటర్లు బాలికకు గంజాయి తాగించి అత్యాచారం చేశారు.

Published on: Feb 19, 2026, 10:25:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు గంజాయి తాగించి అత్యాచారం చేశారు రౌడీషీటర్లు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముగ్గురు రౌడీషీటర్లు పరారీలో ఉన్నారు. వారికోసం కోసం పోలీసుల గాలింపు చేస్తున్నారు.

బాలికపై అత్యాచారం
బాలికపై అత్యాచారం

బాలిక పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత ఈ దారుణం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాలిక చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి వెళ్లినట్టుగా పోలీసులు అంటున్నారు. బాలిక నార్సింగిలో నానమ్మతో నివసిస్తోంది. నార్సింగి పోలీస్ స్టేషన్‌ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. బాధితురాలు నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీకి చెందినట్టుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భారీగా గంజాయి పట్టివేత

ఇటీవల కొల్లూరు పోలీసులు, శేరిలింగంపల్లి స్పెషల్ ఆపరేషన్స్ టీం(SOT) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు మాదకద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశారు. రూ.25.72 లక్షల విలువైన 101.711 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను విజయనగరం జిల్లాకు చెందిన బస్వ జగన్నాథం(37), ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాకు చెందిన పల్లపు లక్ష్మీనారాయణ (52) గా గుర్తించారు. వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని చిత్రకొండకు చెందిన రాజు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

గంజాయికి బానిసైన నిర్మాణ కార్మికులను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. సరఫరాదారు సుమారు 10 రోజుల క్రితం సరుకును డెలివరీ చేశారు. ఆ తర్వాత పెడ్లర్లు దానిని నిర్మాణ ప్రదేశాలలో విక్రయించే ఉద్దేశ్యంతో లేబర్ క్యాంపుల సమీపంలోని తెల్లాపూర్ గ్రామానికి తరలించారు.

కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు.. వాటిని పంపిణీ చేయడానికి ముందే ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 లక్షలకుపైగా విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజు కోసం గాలింపు చేపడుతున్నారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని డయల్ 100, సైబరాబాద్ NDPS ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ లేదా అధికారిక వాట్సాప్ హెల్ప్‌లైన్ ద్వారా పంచుకోవాలని పోలీసులు తెలిపారు. సమాచారం ఇచ్చేవారి గుర్తింపు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. వాట్సాప్ నెంబర్ 9490617444కు ఫిర్యాదు చేయవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More