రాజకీయాల్లో సరికొత్త ప్రస్థానం ప్రారంభించాలని భావించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన(TRS) పేరు రిజిస్ట్రేషన్‌ను సాంకేతిక కారణాలతో ఈసీ తిరస్కరించింది. ఈ పేరు మార్పుపై తక్షణమే స్పందించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కవితకు అధికారికంగా లేఖ అందింది.

ప్రజల్లో గందరగోళానికి తావులేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ పరిణామంతో కవిత అభిమానులు, అనుచరులు ఆందోళనలో పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖలో ఈ పేరును ఎందుకు అనుమతించడం లేదనే విషయాలను స్పష్టంగా వివరించింది. ప్రధానంగా కొన్ని అంశాలను ఈసీ ప్రస్తావించింది.
‘టిఆర్ఎస్’ (TRS) అనే సంక్షిప్త నామానికి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ఇదే పేరుతో సుదీర్ఘ కాలం పాటు ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీ కొనసాగింది. ఈ పేరుపై పౌరుల నుంచి, ఇతర రాజకీయ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుర్తింపు పొందిన లేదా గతంలో ప్రాచుర్యంలో ఉన్న పార్టీల పేర్లను పోలినట్లుగా కొత్త పార్టీల పేర్లు ఉంటే, భవిష్యత్తులో ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఈసీ భావించింది.
ఈ సాంకేతిక, చట్టపరమైన కారణాల దృష్ట్యా ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరును రిజిస్టర్ చేయడం కుదరదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయం తేల్చిచెప్పింది. కవిత తన కొత్త పార్టీకి సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే, రాబోయే 15 రోజులలోపు ప్రత్యామ్నాయ పేర్లను ఈసీకి ప్రతిపాదించాల్సి ఉంటుంది.
ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఈ ఊహించని బ్రేక్‌తో కవిత, ఆమె ముఖ్య అనుచరులు, రాజకీయ వ్యూహకర్తలు అలర్ట్ అయ్యారు. తదుపరి కార్యాచరణపై అత్యవసరంగా దృష్టి సారించారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా, చట్టపరమైన ఇబ్బందులు లేని.. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రతిబింబించేలా ఉండే కొత్త పేర్లను ఎంపిక చేయాల్సి ఉంది.
{{/usCountry}}ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఈ ఊహించని బ్రేక్‌తో కవిత, ఆమె ముఖ్య అనుచరులు, రాజకీయ వ్యూహకర్తలు అలర్ట్ అయ్యారు. తదుపరి కార్యాచరణపై అత్యవసరంగా దృష్టి సారించారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా, చట్టపరమైన ఇబ్బందులు లేని.. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రతిబింబించేలా ఉండే కొత్త పేర్లను ఎంపిక చేయాల్సి ఉంది.
{{/usCountry}}ఈసీ లేఖకు తెలంగాణ రక్షణ సేన సమాధానాలు ఇచ్చింది. కేవలం రెండు అభ్యంతరాలను మాత్రమే ఈసీ తమకు పంపిందని తెలిపింది. మిగతా అభ్యంతరాలను చెప్పకుండా ప్రత్యామ్నాయ పేర్లను ఎలా అడుగుతారని ప్రశ్నించింది. పార్టీ పేరు అంశంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేసింది.
మరో వైపు కవిత ఈ విషయంపై సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈసీ విధించిన 15 రోజుల గడువు ముగిసేలోపే కొత్త పేర్ల ప్రతిపాదనలను పంపి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారా? లేదంటే న్యాయపోరాటం చేస్తారా? చూడాలి.