కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుపై ట్విస్ట్.. కొత్త పేరు చెప్పాలని ఈసీ ఆదేశాలు.. 15 రోజులే డెడ్‌లైన్!
కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేనకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరుకు బదులుగా మరో పేరు చెప్పాలని లేఖ రాసింది.
రాజకీయాల్లో సరికొత్త ప్రస్థానం ప్రారంభించాలని భావించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన(TRS) పేరు రిజిస్ట్రేషన్‌ను సాంకేతిక కారణాలతో ఈసీ తిరస్కరించింది. ఈ పేరు మార్పుపై తక్షణమే స్పందించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కవితకు అధికారికంగా లేఖ అందింది.

ప్రజల్లో గందరగోళానికి తావులేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ పరిణామంతో కవిత అభిమానులు, అనుచరులు ఆందోళనలో పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖలో ఈ పేరును ఎందుకు అనుమతించడం లేదనే విషయాలను స్పష్టంగా వివరించింది. ప్రధానంగా కొన్ని అంశాలను ఈసీ ప్రస్తావించింది.
‘టిఆర్ఎస్’ (TRS) అనే సంక్షిప్త నామానికి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ఇదే పేరుతో సుదీర్ఘ కాలం పాటు ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీ కొనసాగింది. ఈ పేరుపై పౌరుల నుంచి, ఇతర రాజకీయ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుర్తింపు పొందిన లేదా గతంలో ప్రాచుర్యంలో ఉన్న పార్టీల పేర్లను పోలినట్లుగా కొత్త పార్టీల పేర్లు ఉంటే, భవిష్యత్తులో ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఈసీ భావించింది.
ఈ సాంకేతిక, చట్టపరమైన కారణాల దృష్ట్యా ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరును రిజిస్టర్ చేయడం కుదరదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయం తేల్చిచెప్పింది. కవిత తన కొత్త పార్టీకి సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే, రాబోయే 15 రోజులలోపు ప్రత్యామ్నాయ పేర్లను ఈసీకి ప్రతిపాదించాల్సి ఉంటుంది.
ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఈ ఊహించని బ్రేక్‌తో కవిత, ఆమె ముఖ్య అనుచరులు, రాజకీయ వ్యూహకర్తలు అలర్ట్ అయ్యారు. తదుపరి కార్యాచరణపై అత్యవసరంగా దృష్టి సారించారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా, చట్టపరమైన ఇబ్బందులు లేని.. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రతిబింబించేలా ఉండే కొత్త పేర్లను ఎంపిక చేయాల్సి ఉంది.
ఈసీ లేఖకు తెలంగాణ రక్షణ సేన సమాధానాలు ఇచ్చింది. కేవలం రెండు అభ్యంతరాలను మాత్రమే ఈసీ తమకు పంపిందని తెలిపింది. మిగతా అభ్యంతరాలను చెప్పకుండా ప్రత్యామ్నాయ పేర్లను ఎలా అడుగుతారని ప్రశ్నించింది. పార్టీ పేరు అంశంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేసింది.
మరో వైపు కవిత ఈ విషయంపై సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈసీ విధించిన 15 రోజుల గడువు ముగిసేలోపే కొత్త పేర్ల ప్రతిపాదనలను పంపి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారా? లేదంటే న్యాయపోరాటం చేస్తారా? చూడాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


