...
...
Next Story

జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం - రోజువారీ విచారణకు హైకోర్టులో ఈడీ పిటిషన్!

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోరింది. ప్రతిరోజూ విచారణ చేపట్టి నిందితులు వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

Published on: Oct 10, 2026, 17:15:47 IST
Advertisement

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటు ఇతర నిందితులపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో అడుగు వేసింది. పిఎంఎల్‌ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం) నిబంధనల కింద నమోదు చేసిన కేసుల విచారణను వేగవంతం చేయాలని, ప్రతిరోజూ (డే-టు-డే) విచారణ జరిపి నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ… తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

74 మందిపై అభియోగాలు….

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల్లోకి క్విడ్ ప్రో కో విధానంలో భారీగా పెట్టుబడులు వచ్చాయని సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వివిధ ప్రముఖ సంస్థలు, వ్యక్తులకు లబ్ధి చేకూర్చారని…. దానికి ప్రతిఫలంగానే జగన్ కంపెనీల్లోకి అపారమైన పెట్టుబడులు వచ్చాయనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో జగన్‌తో పాటు మొత్తం 74 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.

ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో 2016 నుంచి 2021 మధ్య కాలంలో తొమ్మిది సీఆర్‌పిసీ/పిఎంఎల్‌ఏ ప్రొసిక్యూషన్ ఫిర్యాదులను (ఛార్జ్‌షీట్లను) దాఖలు చేసింది. సీబీఐ కోర్టు ఈ తొమ్మిది ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంది. అయితే, నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లు (కేసు నుంచి మినహాయించాలని కోరే పిటిషన్లు) సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఈ డిశ్చార్జ్ పిటిషన్లు తేలకపోవడంతో ప్రధాన కేసు విచారణ ఆరంభ దశలోనే నిలిచిపోయిందని…. కేసు ముందుకు సాగడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈడీ పేర్కొంది. న్యాయమూర్తుల బదిలీలు మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ పూర్తయినప్పటికీ తీర్పులు వెలువడలేదని వివరించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks