హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Sahiti Infratech) నిధుల మళ్లింపు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ భారీ మనీలాండరింగ్ స్కామ్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది.

సెప్టెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ఈ స్కామ్‌లో ప్రజాప్రతినిధికి ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బ్యాంక్ ఖాతాలకు సాహితి ఇన్‌ఫ్రా సంస్థ నుంచి దాదాపు రూ.2.1 కోట్లు మళ్లినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నిధుల బదిలీ ఏ ప్రాతిపదికన జరిగింది? వ్యాపారపరమైన చెల్లింపులా లేక ఇతర మళ్లింపులా అనే కోణంలో ఈడీ ప్రశ్నించనుంది. నిధుల మళ్లింపు నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఆస్తులు, ఫ్లాట్లు, వ్యాపారాలపై ఈడీ నిశిత పరిశీలన చేస్తోంది.
తెలంగాణ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ చట్టం (PMLA) కింద దర్యాప్తు చేపట్టింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకర్షించిన సాహితి ఇన్‌ఫ్రా యాజమాన్యం, నిధులను ప్రాజెక్టులకు వాడకుండా స్వప్రయోజనాలకు మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి.
మొదట్లో రూ.248 కోట్ల అక్రమాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. తదుపరి విచారణలో స్కామ్ విలువ ఏకంగా రూ.842 కోట్లకు చేరినట్లు తేలింది. 2018-2020 మధ్య కాలంలో రూ.50 కోట్లను నగదు రూపంలో తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. మొత్తం రూ.126 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగానికి గురయ్యాయి. సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.
స్కామ్‌తో సంబంధం ఉన్న దాదాపు 56 బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. మొదటి విడతలో రూ.161 కోట్ల విలువైన ఆస్తులు, ఆ తర్వాత మరో విడతలో రూ.12.6 కోట్ల ఆస్తులను ఈడీ ప్రాథమికంగా అటాచ్ చేసింది. సాహితి ఇన్‌ఫ్రా ఎండీ బి. లక్ష్మీనారాయణను 2024 సెప్టెంబర్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎస్‌జే కోర్టులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలయ్యాయి.ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సెప్టెంబర్ 27న జరిగే విచారణలో సమర్పించే ఆధారాలు, వివరణ ఆధారంగా కేసు తదుపరి దశకు చేరుకోనుంది.
{{/usCountry}}స్కామ్‌తో సంబంధం ఉన్న దాదాపు 56 బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. మొదటి విడతలో రూ.161 కోట్ల విలువైన ఆస్తులు, ఆ తర్వాత మరో విడతలో రూ.12.6 కోట్ల ఆస్తులను ఈడీ ప్రాథమికంగా అటాచ్ చేసింది. సాహితి ఇన్‌ఫ్రా ఎండీ బి. లక్ష్మీనారాయణను 2024 సెప్టెంబర్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎస్‌జే కోర్టులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలయ్యాయి.ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సెప్టెంబర్ 27న జరిగే విచారణలో సమర్పించే ఆధారాలు, వివరణ ఆధారంగా కేసు తదుపరి దశకు చేరుకోనుంది.
{{/usCountry}}