...
...
Next Story

TG TET Notification 2025 : 'టెట్' నిర్వహణపై కసరత్తు - త్వరలో నోటిఫికేషన్...! ఇదిగో తాజా అప్డేట్

టీజీ టెట్ ప్రకటన విడుదలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఎగ్జామ్ నిర్వహణపై ప్రతిపాదనలు కూడా పంపింది. ఇందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఆ వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Published on: Nov 9, 2025, 12:30:03 IST
Advertisement

రాష్ట్రంలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే… వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది.

టీజీ టెట్ ఎగ్జామ్ 2025
టీజీ టెట్ ఎగ్జామ్ 2025

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జూన్ నోటిఫికేషన్ పూర్తి అయింది. మరో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఏపీలో నోటిఫికేషన్ జారీ కావటంతో పాటు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. డిసెంబర్ లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

ఇప్పటికే టెట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను కూడా ఇచ్చింది. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వం టీచర్లు సైతం ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్‌ పాస్‌ కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టెట్‌ జీవోలో సవరణ చేసి నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంటుంది.

గ్రీన్ సిగ్నల్ ఇస్తే నోటిఫికేషన్…!

మరోవైపు టెట్ ఎగ్జామ్ పై రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో…. వీరంతా కూడా ఎగ్జామ్ రాయాల్సి పరిస్థితి ఏర్పడింది. వీరి సంఖ్య 45 వేలకుపైగా ఉంటుందని అంచనా. ఈ అంశంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని… విద్యాశాఖ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.

టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయటానికి వీలవుతుంది. ఇక ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైతే ఇందుకు సంబంధించిన సమాచారం, సిలబస్ వివరాలను https://schooledu.telangana.gov.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks