రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం.. తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో పరిణామాలను సమర్థవంతంగా అడ్డుకోవడానికి, తక్షణ చర్యలు చేపట్టేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛైర్మన్గా ఆరుగురు మంత్రులతో కూడిన అత్యున్నత స్థాయి సబ్-కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మంత్రివర్గ ఉప-కమిటీలో కీలక శాఖల మంత్రులకు చోటు కల్పించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవడం ఈ కమిటీ ప్రధాన విధి. వర్షపు నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ఇంకుడు గుంతలు, చెరువులు, లీకేజీ కుంటల నిర్మాణం, వాటి నిర్వహణను పర్యవేక్షించనుంది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ నినో ప్రభావంపై మాట్లాడారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్లో నీటిమట్టాలు సాధారణం కంటే ఏకంగా 72 శాతం, గోదావరి బేసిన్లో 40 శాతం వరకు పడిపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
నీటి లభ్యత లేకపోవడం వల్ల వేల ఎకరాల్లో సాగులో ఉన్న పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపత్తును ముందస్తుగా నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనే విధానంపై అన్ని రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు దసరా పండుగ తర్వాత ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, సాగునీటి రక్షణే లక్ష్యంగా ఈ సబ్-కమిటీ త్వరలోనే తన కార్యాచరణను ప్రారంభించనుంది.
{{/usCountry}}ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనే విధానంపై అన్ని రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు దసరా పండుగ తర్వాత ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, సాగునీటి రక్షణే లక్ష్యంగా ఈ సబ్-కమిటీ త్వరలోనే తన కార్యాచరణను ప్రారంభించనుంది.
{{/usCountry}}