ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ANGRAU Recruitment 2026 : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. చింతపల్లిలోని రీజనల్ అగ్రికల్చర్ రిసెర్చ్ స్టేషన్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిధిలో ఉన్న పాలిటెక్నిక్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి సవరించిన ప్రకటన విడుదలైంది. పూర్తిగా ఒప్పంద (కాంట్రాక్ట్/తాత్కాలిక) ప్రాతిపదికన 11 నెలల కాలపరిమితి కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులకు 07.09.2026న వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

టీచింగ్ అసోసియేట్ - 1 పోస్టు కోసం నోటిఫికేషన్ వెలువడింది. వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్‌డి లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. మాస్టర్స్ అభ్యర్థులకు సంబంధిత రంగంలో బోధన/పరిశోధన అనుభవం, రీసెర్చ్ పేపర్ ప్రచురణ లేదా నెట్ అర్హత ఉండాలి. డిగ్రీలు ఐసీఏఆర్(ICAR) గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి పొంది ఉండాలి.
పిహెచ్‌డి ఉన్నవారికి నెలకు రూ. 67,000 + హెచ్‌ఆర్ఏ (HRA). మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి నెలకు రూ. 61,000 + హెచ్‌ఆర్ఏ చెల్లిస్తారు. ఇంటర్వ్యూ తేదీ నాటికి పురుషులకు గరిష్టంగా 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు ఉండాలి.
టీచింగ్ అసిస్టెంట్ 3 పోస్టులు కూడా ఉన్నాయి. దీనికోసం నాలుగేళ్ల బి.ఎస్సీ (అగ్రికల్చర్) లేదా బి.టెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నెలకు రూ. 35,000 స్థిర వేతనం పొందుతారు. ఇంటర్వ్యూ తేదీ నాటికి గరిష్టంగా 35 ఏళ్ల లోపు ఉండాలి.
ఈ నియామకాలు కేవలం 11 నెలల తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉంటాయి. దీని ఆధారంగా భవిష్యత్తులో క్రమబద్ధీకరణ లేదా శాశ్వత ఉద్యోగం క్లెయిమ్ చేయడానికి వీలుండదు. అభ్యర్థులు తమ స్వంత ఖర్చులతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది, ఎలాంటి టీఏ/డీఏ ఇవ్వరు. నియామకానికి ముందు అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో వైద్య పరీక్షలు చేయించుకుని శారీరక ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి.
ఇంటర్వ్యూను రద్దు చేసే లేదా వాయిదా వేసే హక్కు పరిశోధన సహ సంచాలకులకు ఉంటుంది. వాక్-ఇన్-ఇంటర్వ్యూ 07 సెప్టెంబర్ 2026, ఉదయం 10.00 గంటల నుంచి ఉంటుంది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 531111లో జరగుతుంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలతో కూడిన బయోడేటా ఫారమ్, పదో తరగతి నుంచి పొందిన అన్ని ఒరిజినల్ విద్యార్హతల సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు, ఒక సెట్ సెల్ప్ అటెస్టెడ్ జిరాక్స్ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అనుభవ ధృవీకరణ పత్రాలు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నట్లయితే 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్'లతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


