...
...
Next Story

నెల్లూరు జైలుకు నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌!

నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ను విజయవాడ నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published on: Nov 3, 2025, 17:05:39 IST
Advertisement

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాము ఇంటికి సిట్, ఎక్సైజ్, పోలీస్ అధికారులు చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మూడు నాలుగు గంటలపాటు అక్కడ హడావుడి నడిచింది. అయితే తర్వాత జోగి రమేశ్ బయటకు వచ్చారు. దీంతో సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

జోగి రమేశ్(ఫైల్ ఫొటో)
జోగి రమేశ్(ఫైల్ ఫొటో)

జోగి రమేశ్‌ను సుమారు 12 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. ఆయన సోదరుడు రాముని కూడా వేరేగా విచారించారు. జనార్దనరావుతో సంబంధాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత అధికారులు జోగి రమేశ్‌ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధారాత్రి దాటిన తర్వాత వాదనలు మెుదలవ్వగా.. న్యాయమూర్తి తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. మెుదట జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముని విజయవాడ జైలుకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి తాజాగా నెల్లూరు జైలుకు తరలించారు. జైలు మార్పుతో జోగి రమేశ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే జోగి రమేశ్‌కు ఆసుపత్రి వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపు పోలీసులు, జోగి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో హాస్పిటల్ అద్దాలు పగలగొట్టారు.

జోగి రమేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నంత సేపు ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలోకి వచ్చేందుకు జోగి అనుచరులు ప్రయత్నం చేశారు. పోలీసులు సముదాయించినా.. వెనక్కి తగ్గలేదు. దీంతో తోపులాట జరిగింది. అయితే అద్దాలు పగలగొట్టిన ఘటనపై జోగి రమేష్ భార్య, కుమారుడిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మాచవరం పోలీసులకు డ్యూటీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks