ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్ - ఈ 8 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, తేదీలు, హాల్టింగ్ వివరాలివే

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోడనూర్-బరౌని-పోడనూర్ ప్రత్యేక రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

Published on: Oct 28, 2026, 13:44:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పోడనూర్ - బరౌని - పోడనూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. ఫలితంగా ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వైపు వెళ్లే వేలాది మంది ప్రయాణికులకు ఊరట లభించనుంది.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - ప్రత్యేక రైళ్లు పొడిగింపు
రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - ప్రత్యేక రైళ్లు పొడిగింపు

మొత్తం 8 సర్వీసులు పొడిగింపు..

  • రైలు నంబర్ 06021 (పోడనూర్ - బరౌని) : ఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం ఉదయం 06:15 గంటలకు పోడనూర్ నుంచి బయలుదేరి, మంగళవారం మధ్యాహ్నం 13:30 గంటలకు బరౌని చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసును నవంబర్ 8, 2026 నుంచి నవంబర్ 29, 2026 వరకు (మొత్తం 4 ట్రిప్పులు) పొడిగించారు.
  • రైలు నంబర్ 06022 (బరౌని - పోడనూర్) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు ప్రతి బుధవారం ఉదయం 10:30 గంటలకు బరౌని నుంచి బయలుదేరి, శుక్రవారం రాత్రి 18:30 గంటలకు పోడనూర్ చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసును నవంబర్ 11, 2026 నుంచి డిసెంబర్ 02, 2026 వరకు (మొత్తం 4 ట్రిప్పులు) అందుబాటులో ఉంచనున్నారు. రెండు మార్గాల్లో మొత్తం 8 ప్రత్యేక సర్వీసులను ప్రయాణికుల కోసం నిర్వహించనున్నారు.

ఈ ప్రత్యేక రైళ్లు వైవైపులా ప్రయాణించే క్రమంలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. ఇందులో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లున్నాయి. అంతేకాకుండా తమిళనాడులోని తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, పెరంబూర్… ఇతర రాష్ట్రాల్లోని బల్హార్షా, చంద్రపూర్, నాగపూర్, బెతుల్, ఇటార్సి, పిపారియా, గాదర్‌వారా, జబల్‌పూర్, కట్ని, మైహార్, సాత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛివోకి, చునార్, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (డీడీయూ), బాక్సర్, ఆరా, దానాపూర్, పాట్లీపుత్ర, సోన్‌పూర్, హాజీపూర్, షాపూర్ పటోరీ స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.

ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ప్రణాళికలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. ఈ టికెట్లను ఆన్‌లైన్ లేదా ఐఆర్‌సీటీసీ (IRCTC) కౌంటర్ల ద్వారా బుక్ చేసుకుని

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More