Summer Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ - మరిన్ని ప్రత్యేక రైళ్లు పొడిగింపు, లిస్టులో తిరుపతి ట్రైన్స్
South Central Railway Summer Special Trains: వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు మార్గాల్లో నడుస్తున్న సమ్మర్ స్పెషల్ రైళ్ల సర్వీసులను పొడిగించింది. ఏప్రిల్ 17 నుంచి 24 వరకు ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.
South Central Railway Summer Special Trains 2026 : వేసవి వేళ ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైళ్లలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు… దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లపై ఫోకస్ పెడుతోంది. కొత్త వాటిని ప్రకటించటంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న పలు 'సమ్మర్ స్పెషల్' రైలు సర్వీసులను పొడిగించే పనిలో పడింది. తాజాగా పలు రూట్లలో నడిచే రైళ్లను పొడిగిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది.

తాజాగా కొన్ని ప్రత్యేక రైళ్లను పొడిగించటంతో…. ముఖ్యంగా తిరుపతి, చర్లపల్లి, సికింద్రాబాద్, కాకినాడ, మైసూర్ వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి పెద్ద ఊరటనివ్వనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సాధారణ రైళ్లలో బెర్తులు దొరకని వారికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. చర్లపల్లి నుంచి తిరుచానూర్, సికింద్రాబాద్ నుంచి అనకాపల్లి, తిరుపతి నుంచి అకోలా, పండరీపూర్ వంటి మార్గాల్లో ఈ పొడిగింపు వర్తిస్తుంది.
దక్షిణ మధ్య రైల్వే తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం…. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 24, 2026 మధ్య కాలంలో ఈ ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇందులో కొన్ని రైళ్లు ఒక ట్రిప్పు మాత్రమే నడుస్తుండగా…. మరికొన్ని రెండు ట్రిప్పులు నడిచేలా ప్రణాళికలు రూపొందించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతి, తిరుచానూర్‌లకు అనుసంధానించే రైళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే హైదరాబాద్‌లోని చర్లపల్లి టెర్మినల్ నుంచి కూడా అధిక సంఖ్యలో రైళ్లను కేటాయించారు.
పొడిగించిన రైలు సర్వీసుల వివరాలు:
- 07251/52 చర్లపల్లి - తిరుచానూర్ - చర్లపల్లి : ఏప్రిల్ 22, 23 01
- 07605/06 తిరుపతి - అకోలా - తిరుపతి : ఏప్రిల్ 17, 19 01
- 07787/88 కాచిగూడ - తిరుచానూర్ - కాచిగూడ: ఏప్రిల్ 23, 24 01
- 07000/01 తిరుపతి - చర్లపల్లి - తిరుపతి: ఏప్రిల్ 21, 22 01
- 07031/17 చర్లపల్లి - తిరుపతి/తిరుచానూర్: ఏప్రిల్ 24, 19 01
- 07055/56 సికింద్రాబాద్ - అనకాపల్లి - సికింద్రాబాద్: ఏప్రిల్ 23, 24 01
- 07033/34 కాకినాడ టౌన్ - మైసూర్ - కాకినాడ : ఏప్రిల్ 17, 20, 21 02
- 07165/66 చర్లపల్లి - భువనేశ్వర్ - చర్లపల్లి : ఏప్రిల్ 20, 21 01
- 07043/44 హైదరాబాద్ - బెళగావి - హైదరాబాద్ : ఏప్రిల్ 23, 24 01
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

