రాబోయే పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా…. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదల (Stoppage) గడువును పొడిగించింది.

పండుగల సమయంలో సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు, ఐటీ ప్రాంతంలో నివసించే వారికి నేరుగా ప్రయాణ సౌలభ్యం కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.
దసరా. దీపావళి పండుగల రద్దీ కోసం 2026 అక్టోబర్ 27 నుండి 2026 నవంబర్ 10 వరకు (15 రోజుల పాటు) రైళ్ల నిలుపుదల కొనసాగుతుంది. ఆ తర్వాత క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు 2026 డిసెంబర్ 18 నుండి 2027 జనవరి 19 వరకు (33 రోజుల పాటు) ఈ తాత్కాలిక హాల్టింగ్ సదుపాయాన్ని పొడిగించారు.
గతంలో ఈ రైళ్లకు 2026 అక్టోబర్ 9 నుండి 2026 అక్టోబర్ 26 వరకు (18 రోజులు) మాత్రమే హాల్ట్ కేటాయిస్తూ ముందస్తు ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రయాణికుల అవసరాలను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే…. తాజాగా రెండు విడతలుగా నిలుపుదల కాలాన్ని విస్తరించింది.
హైటెక్ సిటీలో నిలిచే ట్రైన్….
- నర్సాపూర్ - లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ - 17255)
- లింగంపల్లి - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్- 17256)
- కాకినాడ టౌన్ - లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య - 12775)
- లింగంపల్లి - కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ - 12776)
ఉచితంగా బోర్డింగ్ పాయింట్…
ఇప్పటికే లింగంపల్లి స్టేషన్ నుంచి ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో వెసులుబాటు కల్పించింది. పైన పేర్కొన్న పొడిగించిన తేదీలలో ప్రయాణించే వారు, రూపాయి కూడా అదనపు రుసుము చెల్లించకుండా నియమావళి ప్రకారం తమ 'బోర్డింగ్ పాయింట్'ను లింగంపల్లి నుండి హైటెక్ సిటీ స్టేషన్కు ఉచితంగా మార్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}ఇప్పటికే లింగంపల్లి స్టేషన్ నుంచి ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో వెసులుబాటు కల్పించింది. పైన పేర్కొన్న పొడిగించిన తేదీలలో ప్రయాణించే వారు, రూపాయి కూడా అదనపు రుసుము చెల్లించకుండా నియమావళి ప్రకారం తమ 'బోర్డింగ్ పాయింట్'ను లింగంపల్లి నుండి హైటెక్ సిటీ స్టేషన్కు ఉచితంగా మార్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}